శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 27, 2021 , 00:49:27

దుబ్బాకలో.. అభివృద్ధి దూకుడు

దుబ్బాకలో.. అభివృద్ధి దూకుడు

ఏడాదిలో రూ. 21 కోట్లతో అభివృద్ధి పనులు

దుబ్బాక మున్సిపాలిటీ  అభివృద్ధి పనుల వివరాలు..

దుబ్బాక, జనవరి 26 : అభివృద్ధిలో ‘దుబ్బాక’ మున్సిపాలిటీ తనదైన ముద్ర వేసుకుంటున్నది. దుబ్బాకతో పాటు  పట్టణ పరిధి గ్రామాలైన లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్‌, దుంపలపల్లి, చెల్లాపూర్‌, మల్లాయిపల్లి గ్రామాలతో మొదట దుబ్బాక నగర పంచాయతీగా, అనంతరం మున్సిపాలిటీగా అవతరించింది. దశాబ్దకాలం తర్వాత జరిగిన తొలి పురపోరులో దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం దుబ్బాకకు కొంత నష్టం వాటిల్లినప్పటికీ, సీఎం కేసీఆర్‌, మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిల ప్రత్యేక చొరవతో దుబ్బాకలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. స్వచ్ఛ దుబ్బాక కోసం మున్సిపల్‌ సిబ్బందితో పాలకవర్గం ప్రత్యేక దృష్టిసారించింది. దుబ్బాక మున్సిపాలిటీ పాలకవర్గం కొలువుదీరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. దుబ్బాక పట్టణంలో  జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక కథనం..

దుబ్బాక మున్సిపాలిటీ ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధిలో తమదైన ముద్ర వేసుకున్నది. ఏడాదికాలంగా దుబ్బాక మున్సిపాలిటీలో కోట్ల రూపాయాల అభివృద్ధి పనులు జరగడమే గాక మరిన్ని పనులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు దుబ్బాక మున్సిపాలిటీలో రూ. 21 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి.

రూ.20 లక్షలతో దుబ్బాకలో హెచ్‌పీ గ్యాస్‌ గోదాం నుంచి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల వరకు లింకురోడ్డు.

దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో (ఒక్కో వార్డుకు రూ.10 లక్షలు) రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం.

రూ.60 లక్షలతో దుబ్బాక పట్టణంలో బస్‌డిపో ఎదుట, తెలంగాణ తల్లి విగ్రహం సర్కిల్‌లో జంక్షన్ల ఏర్పాటు.

రూ.80 లక్షలతో పెద్ద చెరువుకట్ట పక్కన 20 షాపింగ్‌ కాంప్లెక్స్‌ (దుకాణ సముదాయ) భవనం.

రూ.60 లక్షలతో పాత పశు వైద్యశాల వద్ద 10 షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణం.

రూ. 20 లక్షలతో దుబ్బాక అంగడి బజార్‌లో షీ-టాయిలెట్స్‌.  

రూ.5 కోట్లతో (టీయూఎఫ్‌ఐడీసీ నిధులు) 20 వార్డుల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు నిర్మాణాలు.

75 లక్షలతో నాన్‌ వెజ్‌ మార్కెట్‌ (మాంసపు విక్రయ దుకాణాలు) భవన నిర్మాణం.

రూ. 3 కోట్లతో (ఎస్‌ఎస్‌పీ నిధులు) పట్టణ ప్రకృతి వనాల నిర్మాణం.

రూ. 25 లక్షలతో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు. 

రూ. 6 కోట్లతో మున్సిపాలిటీలో వివిధ కుల సంఘాల భవనాలు నిర్మాణాలు.

రూ. 50 లక్షలతో స్మృతి వనం. 

రూ.50 లక్షలతో వైకుంఠధామం. 

రూ.60 లక్షలతో రామసముద్రం చెరువు కట్టపై, పెద్ద చెరువు కట్టపై  లైటింగ్‌ ఏర్పాటు.  

 అందరి సహకారంతోనే అభివృద్ధి ..

దుబ్బాక బల్దియాకు తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికకావడం చాలా సంతోషంగా ఉంది. దుబ్బాక పట్టణాభివృద్ధిలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారం మరిచిపోలేనిది. దుబ్బాకలోని 20 వార్డులను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటి వరకు రూ.21 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పారిశుధ్య పనులు మెరుగు పర్చడంతో పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మరిన్ని అభివృద్ధి పనుల కోసం మంత్రి గారికి విన్నవించాం. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఏడాది కాలాన్ని విజయవంతం పూర్తి చేసుకున్నందుకు కౌన్సిలర్‌లకు, పట్టణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు.                             - గన్నె వనితారెడ్డి, దుబ్బాక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  

VIDEOS

logo