బల్దియాతో చేర్యాల దశమారె

చేర్యాల, జనవరి 26 : టీఆర్ఎస్ సర్కారు నూతనంగా ఏర్పాటు చేసిన చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగి పురపాలక సంఘంగా అవతరించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని నెలల క్రితం కమిషనర్‌తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారి, ఏఈతో పాటు తాత్కాలిక సిబ్బందిని సైతం నియమించింది. పట్టణాల అభివృద్ధికి ప్రభు త్వం జారీ చేస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా చేర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బం ది చర్యలు తీసుకుంటున్నారు.
ప్రారంభమైన అభివృద్ధి పనులు
2018 సంవత్సరంలో మున్సిపాలిటీగా అవతరించిన సమయంలో అభివృద్ధి పనులు మందగించినప్పటికీ, నూతన పాలకవర్గం ఏర్పాటు కావడంతో ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణంతో పాటు హరితహారం కార్యక్రమంలో వేలాది మొక్కల పెంపకం తదితర పనులను పాలవర్గం చేపట్టింది. దీంతో పాటు ఆయావార్డుల్లో చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ట్రాక్టర్ల కొనుగోలుతో పాటు ఆటోలను కొనుగోలు చేసి పనులు కొనసాగిస్తున్నారు. వార్డుల్లో ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు పారిశుధ్య సిబ్బందిని అదనంగా నియమించారు. నీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకంలో ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో పాటు సింగిల్ ఫేజ్ మోటర్లు ఏర్పాటు చేసి ప్రజా అవసరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే రూ.50 లక్షల వ్యయంతో మున్సిపాలిటీలో పలు వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు,కల్వర్టుల నిర్మాణం తదితర వాటిని ప్రారంభించారు. 6 వార్డుల్లో 24 లక్షలతో ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు రూ.10 లక్షలతో డ్రైనేజీల నిర్మాణం, చెత్తను తరలించేందుకు రూ.12 లక్షలతో ఆటోల కొనుగోలు, రూ.4 లక్షలతో పెద్దమ్మగడ్డ ప్రాంతంలో ట్యాంకు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో పాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డు ల్లో 50 వేల మొక్కలను నాటి వాటి సంరక్షణ కోసం ట్రీగార్డులు ఏర్పాటు చేశారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ..
మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. మున్సిపల్ కమిషనర్, పాలకవర్గం సహకారంతో అన్ని వార్డులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేస్తున్నాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణంతో పాటు హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తే చేర్యాల మున్సిపాలిటీని ఆదర్శంగా తయారు చేస్తాం.
-అంకుగారి స్వరూపారాణి,
చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్
తాజావార్తలు
- విశాఖ స్టీల్‌పై ఆల్‌పార్టీ.. ప్రధాని అపాయింట్మెంట్ కోరిన జగన్?
- తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు : మంత్రి కేటీఆర్
- రాముడిగా ప్రభాస్.. లక్ష్మణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో..!
- కొత్త రేడార్‌ను అభివృద్ధి చేసిన ఇస్రో
- కొవిడ్ టీకా తీసుకున్న ఎల్కే అద్వానీ
- వరంగల్ జైలుకు బిట్టు శ్రీను
- అత్తారింట్లో భార్యను ఎవరు కొట్టినా భర్తదే బాధ్యత: సుప్రీంకోర్టు
- ఆటో ఇండస్ట్రీ ‘రైట్‌సైజింగ్’: ఆదా కోసం ఉద్యోగాలపై వేటు!
- డిజిటల్ బడ్జెట్ : అందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్
- చిరు సాంగ్‌కు చిందేసిన మోనాల్.. వీడియో వైరల్