బల్దియాల్లో ప్రగతి పరుగులు

కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు
మెరుగు పడిన మౌలిక వసతులు
స్వచ్ఛత, ఆహ్లాదకరంగా మున్సిపాలిటీలు
మారుతున్న రూపురేఖలు
నేటితో ఏడాది పూర్తిచేసుకుంటున్న గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల బల్దియాల పాలకవర్గాలు
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలోని బల్దియాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. ఏండ్ల నాటి సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గల్లీగల్లీనా సీసీ రోడ్లు, మారిన డ్రైనేజీ వ్యవస్థ, ఇంటింటికీ ‘మిషన్ భగీరథ జలాలు, హరితహారంలో విరివిగా మొక్కల పెంపకంతో పరిసరాలు ఆహ్లాదకరంగా మారుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్లు, ప్రతి వార్డులో కమ్యూనిటీ భవనాల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యంగా మారింది. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టిపెట్టి నిధులు మంజూరు చేస్తుండడంతో బల్దియాల రూపురేఖలు మారుతున్నాయి. జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల బల్దియాల పాలకవర్గాలు కొలువుదీరి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం.
బల్దియా పాలనఏడాది పూర్తి
ఏడాదిలో జరిగిన, జరుగుతున్న పనుల వివరాలు ఇలా..
రూ.77 లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మాణం పూర్తి.
రూ.1.20 కోట్లతో వేస్టేజ్ నుంచి ఎరువుల తయారీ ప్లాంట్ నిర్మాణం.
రూ.1.07 కోట్ల ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం.
టీయూఎఫ్ఐడీసీ మిగులు నిధులు రూ.6 కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.
రూ.కోటి ప్లాన్ గ్రాంట్ మిగులు నిధులతో పలు పనులు చివరి దశలో ఉన్నాయి.
రూ.1.20 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం కొనసాగుతోంది.
తాజావార్తలు
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్‌నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్
- వ్యాక్సినే సురక్షితమైన ఆయుధం
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు