మనమే ముందుండాలి

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేటను ప్రథమ స్థానంలో నిలుపుదాం
ప్రతి ఒక్కరూ ‘స్వచ్ఛత’ యాప్‌లో ఫిర్యాదు చేయాలి
త్వరలో అందుబాటులోకి డయాగ్నోస్టిక్ సెంటర్
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట కలెక్టరేట్, జనవరి 26 : స్వచ్ఛ సర్వేక్షణ్ -2021లో సిద్దిపేట మున్సిపాలిటీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుదామని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని 28,17,18,24,25 వార్డుల్లో సీసీ రోడ్ల పునరుద్ధరణ - సీసీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. 28వ వార్డులో ఎన్జీవో కాలనీలో పట్టణ పార్కు, పిల్లల పార్కు, ఆట స్థలాన్ని ప్రారంభించారు. 22వ వార్డులో మోడల్ టాయిలెట్లను అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఇండ్లు నిర్మించేందుకునే వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని, రోడ్లు విస్తారంగా ఉంటేనే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురుకావన్నారు. సిద్దిపేట శుద్ధిపేటగా మార్చుకుందామని, పట్టణ ప్రజలు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛత యాప్‌లో గ్రీవెన్స్‌లో వెళ్లి మీ ఫిర్యాదులు ఇవ్వాలని, ప్రతి పౌరుడు స్వచ్ఛ సర్వేక్షణ్ ఓటింగ్‌లో పాల్గొని సిద్దిపేట పేరును ఇనుమడింపజేయాలని కోరారు. ఇందుకోసం (http:// swachhsurvekshan 2021.org/ CitizenF eedback%2c) లేదా మీ ఫోన్ ద్వారా 1969 డయల్ చేసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నారు. లేదా Vote for your city SS2021 VoteFor YourCitu App ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలో విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేసి నాణ్యమైన సేవలను అందిస్తున్నామని, త్వరలో 40 పడకల ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలను చేయడానికి డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 57 రకాల పరీక్షలు చేయించేలా అందుబాటులోకి తెస్తామని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మెరుగైన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నామని, సీఎం కేసీఆర్ ఇటీవల సిద్దిపేటకు వచ్చినప్పుడు రూ.42 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, దీంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటైన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, రూ.3.50 కోట్లతో సిద్దిపేట చుట్టూ రింగు రోడ్డు మధ్యలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోమటి చెరువును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, మినీ ట్యాంక్‌బండ్ అందాలు చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం వస్తున్నారన్నారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. రూ.300 కోట్లతో రైల్వేలైన్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే సిద్దిపేటకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి ఆరోగ్య సిద్దిపేటగా మార్చుకుందామని .. తడి , పొడి, హానికర చెత్తను వేర్వేరుగా చేసి చెత్త సేకరణ వాహనాలకు అందజేయాలని కోరారు. మన పరిసర ప్రాంతాలు, వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాగానే మురికి నీరు సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు దీప్తి నాగరాజు, ప్రవీణ్, తాళ్లపల్లి లక్ష్మి సత్యనారాయణగౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.