మంగళవారం 09 మార్చి 2021
Siddipet - Jan 26, 2021 , 00:17:14

కోహెడ-సుందరగిరి సుఖప్రయాణం

కోహెడ-సుందరగిరి సుఖప్రయాణం

చివరి దశలో 12 కిమీ. డబుల్‌ రోడ్డు నిర్మాణం

తీరనున్న ప్రయాణికుల వెతలు

కోహెడ, జనవరి 25  : మండల ప్రజలకు హుజూరాబాద్‌ పట్టణ ప్రయాణం ఇక సుఖమయం కానున్నది. కోహెడ మండల కేంద్రం నుంచి శ్రీరాములపల్లి, నకిరకొమ్ముల, కరీం నగర్‌ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేట మీదుగా సుందరగిరి (హుస్నాబాద్‌  కరీంనగర్‌ రహదారి) వరకు గల 12 కిలోమీటర్ల రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చుతున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో రోడ్డు సూపర్‌గా కనిపిస్తోంది.

పదేండ్ల క్రితం ప్రపంచ బ్యాంకు నిధులతో కరీంనగర్‌హైదరాబాద్‌ రాజీవ్‌ రహదారిపై మండలంలోని శనిగరం స్టేజీ నుంచి శనిగరం, తంగళ్లపల్లి, కోహెడ, శ్రీరాములపల్లి, నకిరకొమ్ముల, కరీంనగర్‌ జిల్లా నవాబుపేట మీదుగా సుందరగిరి వరకు గల 22 కిమీ. సింగిల్‌ రోడ్డుగా నిర్మించారు. ఎల్లమ్మ వాగుపై రెండు వంతెనలు కూడా నిర్మించడంతో ఈ రోడ్డు సుందరగిరి నుంచి హుజూరాబాద్‌, అక్కడి నుంచి జమ్మికుంట వరకు వెళ్లే వసతి కలిగింది. సుందరగిరి నుంచి హుజూరాబాద్‌ జమ్మికుంట వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం జరుగడంతో ఇంకా సౌకర్యంగా మారింది. కోహెడ నుంచి శనిగరం వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం జరిగితే భవిష్యత్‌లో ఇదో పెద్ద రహదారి కాగలదు. ఇప్పటికే కోహెడ నుంచి శనిగరం వరకు గల కల్వర్టులు వర్షాలకు కొట్టుకు పోవడంతో ఆరు కల్వర్టర్లను కూడా నిర్మించారు.

ప్రయాణానికి సౌకర్యవంతం..

మండల కేంద్రం నుంచి శ్రీరాములపల్లి నకిరకొమ్ముల మీదుగా కల (12/0 నుంచి 25/4 వరకు) గల 12 కిమీ. సింగిల్‌ బీటీ రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చేందుకు రూ.  12 కోట్ల 60 లక్షల నిధులు మం జూరయ్యాయి. పనులు పూర్తి కావస్తున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తయితే మండల ప్రజలకు మంచి సౌక ర్యంగా మారుతుంది. హుజూరాబాద్‌ జమ్మికుంట వరకు ప్రయాణం సులువుగా మారనున్నది.

-కొక్కుల కీర్తిత, ఎంపీపీ, కోహెడ

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.. 

డబుల్‌ రోడ్డు నిర్మాణంతో  మా గ్రామానికి మేలు జరిగింది. ఇటు మండల కేంద్రానికి వెళ్లేందుకు అటు సుందరగిరి వెళ్లేందుకు మంచి ప్రయాణ సౌకర్యం కలిగింది. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరునకు కృషి చేసిన ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ గారికి కృతజ్ఞతలు.

-వెల్దండి సతీశ్‌ 

సర్పంచ్‌, నకిరకొమ్ముల

VIDEOS

logo