శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 26, 2021 , 00:17:35

మ్యూటేషన్లలో.. ఫస్ట్‌

మ్యూటేషన్లలో.. ఫస్ట్‌

రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటి స్థానం

త్వరలోనే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రిబ్యునల్‌

జిల్లాలో 928 కేసులకు నెల రోజుల్లో పరిష్కారం

మూడు నెలల్లో పూర్తయిన 44,583 సాదాబైనామాలు 

ఎన్నారైలకు ప్రభుత్వం భరోసా..  ధరణిలో ప్రత్యేక పోర్టల్‌

పార్ట్‌-బీ భూములకు నెల రోజుల్లో పరిష్కార మార్గం

భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లాలో ధరణి సేవలు వేగంగా, సులభంగా, తేలిగ్గా, పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా అందుతున్నాయి. పోర్టల్‌ ప్రారంభమైన నాటి నుంచి, ఇప్పటి వరకు 6,562 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 310 పెండింగ్‌ మ్యుటేషన్లను అధికారులు క్లియర్‌ చేసి, జిల్లాను నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారు. త్వరలోనే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రిబ్యునల్‌ ద్వారా వివిధ రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు కొలిక్కి రానున్నాయి. జిల్లాలో 928 కేసులుండగా, ఇవి నెల రోజుల్లో పరిష్కారానికి నోచుకోనున్నాయి.

- సిద్దిపేట, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

వేగంగా, సులభంగా, తేలిగ్గా, పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా ధరణిలో సేవలు అందుతున్నాయి ! పైసా ఖర్చు లేకుండా మూడేండ్లలో పట్టేపనిని గంటల్లో పూర్తి చేసేదే ధరణి! ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే ధరణి..! లంచాలు లేకుండా, పారదర్శకంగా పట్టాపాసు పుస్తకాలు ఇచ్చేందుకే ధరణి..! నిర్దేశిత గడువుతో  ధరణిలో భూ సమస్యలకు పరిష్కారం కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారం..! భూ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్‌. భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సీఎం కేసీఆర్‌ ధరణికి శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లాలో ధరణి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 6,562 రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి 310 పెండింగ్‌ మ్యుటేషన్లను పూర్తిచేసి రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాను నంబర్‌వన్‌ స్థానంలో నిలిపారు. త్వరలోనే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రిబ్యునల్‌ ద్వారా వివిధ రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరిస్తారు. జిల్లాలో 928 కేసులున్నాయి. ఇవి నెల రోజుల్లో పరిష్కారం కానున్నాయి.- సిద్దిపేట, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) 

ధరణి మంచి అవకాశం... 

భూ తగాదాల శాశ్వత పరిష్కారానికి ధరణి మంచి అవకాశం. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయిన దేశంలో భూ తగాదాల పరిష్కారం కావడంలేదు. పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో సగానికి పైగా భూ తగాదాలకు సంబంధించినవే. భూ వివాదాల వల్ల సమయాన్ని, ఆదాయాన్ని, మనశ్శాంతిని రైతులు కోల్పోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ధరణికి శ్రీకారం చుట్టారు. ఇవ్వాళ ధరణితో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం భూముల విషయాల్లో తలదూర్చే అవకాశం లేనంత పారదర్శకంగా ధరణి ఉంది. భూముల రికార్డులను వ్యక్తుల చేతుల్లో నుంచి ధరణితో వ్యవస్థలోకి ప్రభుత్వం తీసుకువచ్చింది. ధరణిలో భూ వివరాలు ఎక్కిందంటే కలెక్టర్‌కు కూడా తొలిగించే, సవరించే అధికారం లేదు. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్‌ సభ్యుడిగా భూ వివాదాల సత్వర పరిష్కారానికి ట్రిబ్యునల్‌. పెండింగ్‌ మ్యుటేషన్లు అమలు చేయడంలో సిద్దిపేట నంబర్‌ -1, నిలిచింది. జిల్లాలో 44,583 సాదా బైనామాల అమలు కోసం రైతులు ధరఖాస్తు చేసుకున్నారు. 3 నెలల్లో అన్ని సాదా బైనామాలకు పరిష్కారం కానున్నాయి. అర్హులకు పాసుపుస్తకాలు జారీ చేస్తారు. పార్ట్‌-(బీ) భూములకు నెల రోజుల్లో పరిష్కరించేలా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భూములున్న ఎన్నారైలకు ప్రభుత్వం భరోసాను కల్పించింది. 

ధరణి పోర్టల్‌లో ఉన్న సదుపాయాలు...

పనిలో పారదర్శకత, సామర్థాన్ని పెంచడం 

జరుగుతుంది. భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఆస్తుల 

బదీలలకు  జవాబు దారి తనంగా ధరణి ఉంటుంది.

భూముల రిజీస్ట్రేషన్‌ల ప్రక్రియను సరళీకృతం చేశారు.

భూమి, ఆస్తి సంబంధిత సమచారాన్ని ఆన్‌లైన్‌లో నిల్వ చేస్తుంది. ప్రభుత్వ 

భూములకు పరిరక్షణ. వ్యవసాయ 

భూముల నమోదు, వారసత్వం 

విభజన సరళీకృతం చేయడానికి 

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిముషాల 

వ్యవధిలోనే పూర్తి చేస్తున్నారు. 

లావాదేవీలు జరిగిన కొద్ది 

నిమిషాల్లోనే సంబంధిత భూ మర్పిడి 

ఉత్తర్వుల పత్రాలను భూ యజమానికి 

అందజేస్తున్నారు. దీనితో పాటు 

ఇ-పట్టాదారు పాస్‌ పుస్తకాలను 

భూ యజమానులకు 

అందించడం ధరణీ యొక్క ప్రత్యేకత 

అని చెప్పవచ్చు.


సులభతరంగా రిజిస్ట్రేషన్‌.. 

రైతులకు తక్కువ సమయంలో సులభతరంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి ధ్రువపత్రాలు అందిస్తున్నాం. భూ విక్రయాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, సమయం వృథా కాకుండా ఉండడంతో రైతులకు రిజిస్ట్రేషన్‌ సేవలు అందిస్తున్నాం. రెండు రోజుల పాటు ధరణిలోని సాంకేతికతో కొంత ఇబ్బంది ఎదురైంది. దానిని సవరించి భూమి రిజిస్ట్రేషన్లు చేశాం. రైతులకు తహసీల్దార్‌ కార్యాలయంలో అందిస్తున్న రిజిస్ట్రేషన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

- బెజ్జంకి తహసీల్దార్‌ జయప్రకాశ్‌రావు

అర గంటలోనే మార్టిగేజ్‌.. 

భూంపల్లి గ్రామానికి చెందిన జయశ్రీ తన వ్యవసాయ భూమి మీద నందిగామ ఐసీఐసీఐ బ్యాంకులో రుణాన్ని పొందింది. ఆమె తీసుకున్న రుణానికి మిరుదొడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సుజాత ఐసీఐసీఐ బ్యాంకుకు ష్యురిటీ ఇవ్వగా, అరగంటలో జయశ్రీ భూమిని మార్టిగేజ్‌ చేసి, ధ్రువ పత్రాలు మాకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. 

- నరేశ్‌, ఐసీఐసీఐ బ్యాంకు అధికారి, నందిగామ(మిరుదొడ్డి) 

క్షణాల్లో బదలాయింపు..

నా పేరు జీల అనిత. మాది అక్కన్నపేట. గతంలో భూమిని కొన్నాం. ఈ రోజు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. మొదట్లో ధరణితో ఏమైనా ఇబ్బందులు ఉంటాయనే అనుమానాలుండేవి. అలాంటిది ఇప్పుడు తహసీల్‌ ఆఫీస్‌లో క్షణాల్లో భూమి బదలాయించి ఇచ్చినారు. వెంటనే రిజిస్ట్రేషన్‌ డ్యాకుమెంట్లు, పట్టాదారు కాపీ అందజేసిన్రు. సార్లు న్యాయం పని చేసినరు. ఆఫీసుల కూడా మర్యాద మాట్లాడిన్రు. 

- జీల అనిత, అక్కన్నపేట


VIDEOS

logo