28న గజ్వేల్ పట్టణంలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీలు

మంత్రి హరీశ్‌రావుకు ఆహ్వానపత్రిక అందజేసిన
గజ్వేల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్ అర్బన్, జనవరి 24 : గజ్వేల్ పట్టణంలో ఈ నెల 28న జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆదివారం గజ్వేల్ ఫుట్‌బాల్ క్లబ్ గౌరవాధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, అధ్యక్షుడు నగేశ్, ఆర్గనైజర్ సెక్రటరీ గణేశ్ తదితరులు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొదటిసారిగా గజ్వేల్‌లో అంతర్జిల్లా ఫుట్‌బాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ పురుషుల క్రీడాపోటీలు నాలుగు రోజుల పాటు జరుగుతాయని, ఇం దుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. పోటీలకు పాటు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, వీసీఎండీ శ్రీనివాసరావు, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రఫత్ అలీ, కార్యదర్శి ఫాల్గుణ తదితరులకు అందజేసినట్లు తెలిపారు.