శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Jan 25, 2021 , 00:03:41

సర్కారు వైద్యం బలోపేతం

సర్కారు వైద్యం బలోపేతం

జిల్లాలో 48 సబ్‌సెంటర్ల భవన నిర్మాణానికి రూ.7.68 కోట్లు మంజూరు 

రూ. 16 లక్షలతో సబ్‌ సెంటర్‌ నిర్మాణం 

నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

సిద్దిపేట కలెక్టరేట్‌ (జనవరి 24) : సర్కారు దవాఖానలను బలోపేతం చేసి రోగులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజావైద్యంలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పన, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. సిద్దిపేట జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 48 ఉప ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించేందుకు రూ.7.68 కోట్లను ఆదివారం ప్రభుత్వం మంజూరు చేసింది. జాతీయ ఆరోగ్య మి షన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులతో ఉప ఆరోగ్య కేంద్రాల భవనాలను నిర్మించనున్నారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు వీలుగా మొదటి విడతగా రూ. 2.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పక్కా భవనాల నిర్మాణం పూర్తయితే గ్రామీణులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. 

పక్కా భవనాలు నిర్మించనున్న సబ్‌ సెంటర్లు... 

భూంపల్లి, వీరారెడ్డిపల్లి, ఖాజీపూర్‌, ఎనగుర్తి, అక్బర్‌పేట, పోతారెడ్డిపేట, రుద్రారం, బద్దిపడగ, గట్లమల్యాల, రాజగోపాల్‌పేట, నంగునూరు, రేగొండ, జనగామ, గండిపల్లి, పందిళ్ల, మిర్జాపూర్‌, మిట్టపల్లి, పొన్నాల, అప్పనపల్లి, పెద్దగుండవెల్లి, సిరిసినగండ్ల, ఖమ్మంపల్లి, జప్తినాచారం, పోతారం, చీకోడు, రామక్కపేట, ధర్మాజీపేట, కోహెడ, కాచాపూర్‌, కూరెల్ల, చాట్లపల్లి, వింజపల్లి, తీగుల్‌, బేగంపేట, ఇందూప్రియాల్‌, వడ్డెపల్లి, తిమ్మాపూర్‌, మిరుదొడ్డి, అల్వాల్‌, ధర్మారం, మల్లుపల్లి, గుర్రాలగొంది, చంద్లాపూర్‌, చిన్నకోడూరు, రామంచ, జగదేవ్‌పూర్‌, ఇటిక్యాల, దూళిమిట్ట గ్రామాల్లో సబ్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 

సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు... 

సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్‌నగర్‌ డబుల్‌ బెడ్‌రూం గృహ సముదాయానికి బస్తీ దవాఖాన మంజూరైంది. బస్తీ దవాఖాన భవన నిర్మాణానికి రూ.16 లక్షలు అధికారులు మంజూరు చేశారు. జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు కేసీఆర్‌నగర్‌లో బస్తీ దవాఖాన ఏర్పాటుకు సీఎం హామీఇచ్చారు. హామీ మేరకు బస్తీ దవాఖాన మంజూరైందని మంత్రి తెలిపారు. బస్తీ దవాఖాన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు ఆదివారం ధన్యవాదాలు తెలిపారు.

VIDEOS

logo