మంగళవారం 09 మార్చి 2021
Siddipet - Jan 24, 2021 , 00:31:43

ఆనందహేల

ఆనందహేల

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై అగ్రవర్ణ పేదల ఆనందం

జిల్లా వ్యాప్తంగా ఓసీ సంఘాల సంబురాలు

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

పదిశాతం కోటాపై ఓసీ  సంఘాల హర్షాతిరేకాలు

పేదల ఆరాధ్యదైవం సీఎం కేసీఆర్‌

అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు

ఊరూరా సంబురాలు చేసుకున్న ప్రజలు

సిద్దిపేట టౌన్‌ (జనవరి 23) : అగ్రవర్ణాల పేదల మేలుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు నిర్ణయం చారిత్రాత్మకమని అగ్రవర్ణాల జేఏసీ నేతలు అన్నారు. సీఎం కేసీఆర్‌ తీసు కున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సిద్దిపేట గాంధీ చౌక్‌ వద్ద శనివారం టపాకాయలు, స్వీట్లు పంచి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హన్మంతరెడ్డి, గంప శ్రీనివాస్‌, రత్నాకర్‌, రాంరెడ్డి, మహేశ్‌, రామేశ్వర్‌రావు, కృష్ణమాచార్యులు ఉన్నారు. 

సీఎం కేసీఆర్‌ పాలనలో సామాజిక న్యాయం

చేర్యాల, జనవరి 23 : సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలోని అన్ని కులాలు, మతా  లు, వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతున్నదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపా రాణి అన్నారు. 10 శాతం రిజర్వేషన్ల అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్ర మంలో వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, కౌన్సి లర్లు నరేందర్‌,  చంటి, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగేశ్వర్‌రావు, గోనే హరి, మంచాల కొండయ్య, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్‌ కిష్టయ్య పాల్గొన్నారు.

నిరుపేదలకు ఆరాధ్యదైవం సీఎం కేసీఆర్‌

చేర్యాల, జనవరి 23 : రాష్ట్రంలోని అన్ని వర్గాలు, కులాల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్‌ అని ఎంపీపీ  కరుణాకర్‌, జడ్పీటీసీ మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్లేశం అన్నారు. ఈ మేరకు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు బాలరాజు, శివకుమార్‌, నాయకులు తివారీ దినేశ్‌, చంద్రారెడ్డి, సుభాని, నాజర్‌, నర్సయ్య, శ్రీనివాస్‌, రాజేశ్‌గౌడ్‌, నౌషద్‌, సందానం పాల్గొన్నారు.

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మకం

మద్దూరు, జనవరి 23 : అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు నిర్ణయం చారిత్రాత్మకమని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణా రెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభి షేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాదగిరి, వైస్‌ ఎంపీపీ సుమలతామల్లేశం, పీఏసీఎస్‌ చైర్మన్‌  తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, స్రవంతి, సవిత, దీపిక, అంజయ్య, సుదర్శన్‌, నాయకులు పరుశరాములు, చంద్రశేఖర్‌, రాజమల్లయ్య, దామెర మల్లేశం, సాయిలు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

కొమురవెల్లి, జనవరి 23 : పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు భిక్షపతి అన్నారు. 10 శాతం రిజర్వేషన్లు స్వాగతిస్తూ  మండల పరి షత్‌ కార్యాలయం సమీపంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్య క్రమంలో మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మల్లయ్య, వైస్‌ ఎంపీపీ రాజేం దర్‌రెడ్డి, సర్పంచ్‌లు కృష్ణారెడ్డి, స్వామిగౌడ్‌, కరుణాకర్‌, ఎంపీటీసీ సాయిమల్లు, పీఏసీ ఎస్‌ డైరెక్టర్‌ నర్సింహులుగౌడ్‌, నేతలు శంకరాచారి, నరేందర్‌రెడ్డి, కిషన్‌, ముత్యం నర్సింహులు, మెరుగు కృష్ణాగౌడ్‌, పొతుగంటి కొంరెల్లి, ఏర్పుల మహేశ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo