మంగళవారం 09 మార్చి 2021
Siddipet - Jan 23, 2021 , 00:04:40

వీధివీధినా విద్యుత్‌ వెలుగులు

వీధివీధినా విద్యుత్‌ వెలుగులు

రాయపోల్‌, జనవరి 22 : ఒకప్పుడు కరెంటు సమస్యతో చీకట్లో మగ్గిన రాయపోల్‌.. ఇప్పుడు విద్యుత్‌ కాంతులతో జిగేల్‌మంటోంది. వీధివీధినా లైట్లతో రాత్రి కూడా పగలులా కనిపిస్తున్నది. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారం తో మండల కేంద్రం మొత్తం కాంతులీనుతున్న ది. సర్పంచ్‌ మౌనిక రాజిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని, మండల కేంద్రంలో నూతనంగా 35 0 విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయించారు. ప్రతి గల్లీలో విద్యుత్‌ కాంతులు వెలుగుతున్నాయి. జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి కిలోమీటర్‌ పొడవున ప్రధాన రహదారిపై రోడ్డకు ఇరువైపుల స్తంభాలను వేయించారు. వారం రోజులు పనులు పూర్తి చేయించి, లైటింగ్‌ను ఏర్పాటు చేయించారు. గతంలో రోడ్డుపై సరైన వెలుతురు లేక ప్రజలు, వాహదారులు, పాదచారులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం లైట్ల ఏర్పాటు చేయడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. మండల కేంద్రంలో విద్యుత్‌ సమస్య తీర్చడంతో పాటు అందుకు తగ్గటుగా లైటింగ్‌ను ఏర్పాటు చేయడంపై మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

అందరి సహకారంతో మరింత అభివృద్ధి 

అందరి సహకారంతో రాయపోల్‌ మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. స్వరాష్ట్రంలో కొత్త మండలంగా ఏర్పాటు కావడంతో గ్రామాభివృద్ధి జరుగడం సంతోషంగా ఉంది. రాజకీయాలకతీతంగా సమష్టి నిర్ణయాలతో గ్రామాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని ప్రగతిబాటలో ముందుంటున్నాం. రాయపోల్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది.

- మౌనిక, రాయపోల్‌ సర్పంచ్‌ 


VIDEOS

logo