బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 21, 2021 , 00:03:28

పంట వివరాల సేకరణ

పంట వివరాల సేకరణ

నంగునూరు (జనవరి 20) : రైతులు పొలాల్లో సాగు చేసిన పం టల వివరాలను నమోదు చేసుకోవాలని సర్పంచ్‌ తిప్పని రమేశ్‌, వైస్‌ ఎంపీపీ కర్ణకంటి రేణుకావేణుగోపాలచారి, రైతుబంధు సమితి మం డ ల అధ్యక్షుడు ఇంగే నరేశ్‌ అన్నారు. బుధవారం మండలంలోని గట్లమ ల్యాలలో పంట సాగు వివరాలను క్లస్టర్‌ ఏఈవో లిఖిత్‌రెడ్డి సేకరించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులందరూ యాసంగి సాగు విస్తీ ర్ణాన్ని వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. పంట వివరాల నమోదుతో కొనుగోళ్లతోపాటు సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు భిక్షపతి, రైతులు నర్సింగరావు, కనకయ్య, నర్సయ్య, బాబు, సురేశ్‌ పాల్గొన్నారు. 

తప్పనిసరిగా నమోదు చేయించాలి  

ప్రశాంత్‌నగర్‌, జనవరి 20 : రైతులు విధిగా  పంటల వివరాలను నమోదు చేయించాలని మం డల వ్యవసాయాధికారి పరశురామ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటినుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు ప్రతి ఏఈవో తమ క్లస్టర్‌ పరిధిలోని ప్రతి రైతుకు సంబంధించి పంట సాగు సమాచారాన్ని సేకరిస్తారన్నారు. ఏ రైతు పంటల వివరాలు తప్పిపోకుండా ప్రజాప్రతినిధు లు, రైతుబంధు సభ్యులు నమోదు చేయించాలని కోరారు. కొనుగోళ్లు, సంక్షేమ పథకాల అమలులో వివరాలు ఉపయోగపడుతాయన్నారు. 

VIDEOS

logo