శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 21, 2021 , 00:03:28

సబ్సిడీ గొర్రెల పంపిణీ

సబ్సిడీ గొర్రెల పంపిణీ

వర్గల్‌, జనవరి 20 : పశుకాపరులను ఆర్థికం గా బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్రంలో మాంస ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పశువైద్యాధికారి శిరీష తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మేకల కాపరుడికి 50 శాతం సబ్సిడీపై గొర్రెలను అందజేస్తుందన్నారు. బుధవారం మండలంలోని నెంటూర్‌ లో 7 యూనిట్లకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ గతంలో మిగిలిన లబ్ధిదారులందరికీ ఇప్పుడు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. ఒక యూనిట్‌ రూ. 25వేలు చెల్లిస్తే ఒక మగ గొర్రెతో కలిపి మొత్తం 10 గొర్రెలను ప్రభుత్వం ఇస్తుందనితెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలమల్లు, సర్పంచ్‌ నిమ్మ రంగారెడ్డి, ఎంపీటీసీ శ్యామల, ఏవో సక్లేశ్‌, ఏఈవో సంపత్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు లింగ కిష్టయ్య పాల్గొన్నారు.

జీవాలకు రోగ నిరోధక మందులు తాగించాలి

కొండపాక, జనవరి 20 : పశుసంవర్ధ్దక శాఖ ఆధ్వర్యంలో కొండపాకలో జీవాల పెంపకందారులకు మందులు అందజేశారు. గొర్రెలు, మేకలకు ఎలాంటి వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాధి నిరోధక మందులు తాగించాలని జీవాల యజ మానులకు పశుసంవర్ధ్దక శాఖ అధికారులు సూ చించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ప్రగతి, గొర్ల పెంపకందారుల సంఘం మం డల అధ్యక్షుడు కనకరాములు పాల్గొన్నారు.  

VIDEOS

logo