శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 20, 2021 , 00:07:32

ఆర్టీసీకి పూర్వవైభవం తెద్దాం

ఆర్టీసీకి పూర్వవైభవం తెద్దాం

  • చేయి ఎత్తిన చోట బస్సును ఆపాలి 
  • ఆదాయం పెంచాలి.. ఆర్టీసీని రక్షించాలి 
  • ఆర్టీసీ ఈడీ  మునిశేఖర్‌ 

సిద్దిపేట టౌన్‌ (జనవరి 19) : ప్రయాణికులు చేయి ఎత్తిన చోట బస్సును ఆపి.. ఆదాయం పెంచుతూ ఆర్టీసీకి పూర్వవైభవం తేవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ మునిశేఖర్‌ అన్నారు. సిద్దిపేట ఆర్టీసీ డిపోను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న సంస్థను కరోనా వైరస్‌ కష్టాల్లోకి నెట్టిందన్నారు. రెండు నెలల పాటు బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కనీసం జీతాలు ఇవ్వని పరిస్థితులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ సిబ్బందికి 50 శాతం జీతాలు ఇచ్చి.. పెద్ద మనస్సును చాటారని కొనియాడారు. ఆర్టీసీ రక్షణకు కార్గో, కొరియర్‌ సేవలను అమలు చేస్తూ సంస్థను కాపాడారన్నారు. ప్రతి రోజు కార్గో, కొరియర్‌ సేవల ద్వారా ఆర్టీసీకి రూ.15 లక్షల ఆదాయం వస్తున్నదని, భవిష్యత్‌లో రూ.30 లక్షల  ఆదాయం  వస్తా యన్నారు.  డ్రైవర్లు, కండక్టర్లు ఐక్యత స్ఫూర్తిని కనబర్చడంతో సంక్రాంతి సమయంలో  జిల్లాకు రూ.14 లక్షల ఆదాయం ఒక్కరోజే వచ్చిం దని, రాష్ట్రవ్యాప్తంగా రూ.14 కోట్లు ఆర్టీసీకి ఆదాయం వచ్చిందన్నారు. పంచసూత్రాలను పాటిస్తూ ఆర్టీసీని లాభాల బాటలోకి తేవాలన్నారు. ఆర్‌ఎం రాజశేఖర్‌ మాట్లాడుతూ.. అందరు కష్టపడి పనిచేసి ఆర్టీసీని అభివృద్ధిలోకి తేవాలన్నారు. ప్రమాద రహిత డ్రైవ ర్లు, శతశాతం ఆదాయం తెచ్చిన కండక్టర్ల ను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

VIDEOS

logo