టీకాతో కరోనా నివారణ

- జిల్లాలో ‘వ్యాక్సినేషన్' విజయవంతం
- జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ
చిన్నకోడూరు, జనవరి 19 : ప్రజలందరినీ భయబ్రాంతులకు గురిచేసి.. జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన కరోనా నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సాగుతుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. మంగళవారం చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు వ్యాక్సిన్ వేశా రు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. కరోనాతో ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఒక్కో సందర్భంలో ఇండ్లకే పరిమితమైన సందర్భాలను చూశామన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతూ అనేక సం క్షేమ పథకాలు కొనసాగించిందన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 127 మందికి టీకా వేయాల్సి ఉండగా, 91 మం దికి వ్యాక్సిన్ వేసినట్లు జడ్పీ చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, వైద్యులు సరిత, షామిలీ, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఉమేశ్చంద్ర, ఇట్టెబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.