స్వచ్ఛ దుబ్బాకనే లక్ష్యం

మున్సిపల్ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టాలి
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక, జనవరి 18 : స్వచ్ఛ దుబ్బాకగా తీర్చి దిద్దుకోవడమే గాక, అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకుందామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో దుబ్బాక పట్టణ ప్రగతి, స్వచ్ఛత కార్యక్రమాలపై ఎంపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా స్వచ్ఛ దుబ్బాకపై కౌన్సిలర్లు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు ఆయన పలు సూచనలు చేశారు. పందుల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు పెంపకందారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. వార్డుల వారీగా ప్రజలకు అవగాహన కల్పించి, ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్లు, ప్లేట్లను పూర్తిగా నిషేధించాలన్నారు. ఫంక్షన్‌హాళ్ల యజమానులకు ప్లాస్టిక్ వినియోగంపై కఠిన ఆంక్షలు విధించాలని తెలిపారు. ఇందుకు మున్సిపల్ తీర్మానం చేసి, అవసరమైతే జరిమానాలు విధించాలన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో దుబ్బాక, లచ్చపేట, చెల్లాపూర్, ధర్మాజీపేట వార్డుల్లో డంపింగ్ యార్డులను వినియోగంలోకి తేవాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు సరఫరా అవుతున్నదని, భగీరథ నీరే ఆరోగ్యకరమన్నారు. వాటర్ ప్లాంట్ నీరు హానికరంగా మారుతున్నందున వాటిని నిషేధించాలని సూచించారు.
మున్సిపల్ ఆదాయాన్ని పెంచాలి
నూతనంగా ఏర్పాటైన దుబ్బాక మున్సిపల్ ఆదాయ వనరులు పెంచేందుకు పాలకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ అన్నారు. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నందున సమస్యగా మారిందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంటి, నల్లా పన్నులతో పాటు ఇతర ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని సూచించారు. 70మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, పారిశుధ్య నిర్వహణ తదితర ఖర్చులకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 14వ ఆర్థికసంఘం నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తామ న్నారు. మున్సిపల్‌కు ప్రత్యేక నిధుల కోసం పురపాలక శాఖ సెక్రటరీతో మాట్లాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితారెడ్డి, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ, మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి, తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆఫ్షన్ మెంబర్లు, సిబ్బంది తదితరులున్నారు.
తాజావార్తలు
- విద్యార్థులతో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్, మార్షల్ ఆర్ట్స్.. వీడియో
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
- 70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!
- చెన్నైలో వ్యాక్సిన్ తీసుకున్న వెంకయ్యనాయుడు
- చాడ్విక్ బోస్మాన్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
- బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ : ఎవరిని పెండ్లి చేసుకుందో తెలిస్తే షాక్!
- గోల్డెన్ గ్లోబ్ అవార్డులు.. బెస్ట్ పిక్చర్ నోమాడ్‌ల్యాండ్