నారు నాటూ లేదు..

నర్సాయపల్లిలో ‘వెదజల్లె’ విధానంలో వరిసాగు
కూలీల బాధ నుంచి గట్టెక్కేందుకు ఎంచుకున్న యువ రైతు
ఈ విధానమే మేలంటున్న రైతు మహిపాల్‌రెడ్డి
ఎకరాకు రూ.5 వేలు మిగిల్చిందని వెల్లడి
నారు వేయకుండా.. నాటు లేకుండా ఓ యువ రైతు వరి పండిస్తున్నాడు. కూలీల బాధ నుంచి గట్టెక్కేందుకు ‘వెదజల్లే’ విధానాన్ని ఎంచుకున్నాడు. ఈ విధానంపై ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ఆ దిశగా నర్సాయపల్లికి చెందిన యువ రైతు మంతెన మహిపాల్‌రెడ్డి ‘సాగు’తున్నాడు. యాసంగిలో తనకున్న ఆరెకరాల పొలంలో వరి వేసి, ఎకరాకు రూ.5వేల చొప్పున మిగిల్చుకున్నాడు. రైతులందరూ ఈ విధానాన్ని పాటించాలని సూచిస్తున్నాడు.
- మద్దూరు, జనవరి 17
మద్దూరు, జనవరి 17 : రోజురోజుకూ పెట్టుబడులు పెరుగుతుండడంతో పాటు కూలీల కొరతతో వ్యవసాయం చేయడం రైతులకు ఇబ్బందిగా మారిం ది. ఈ నేపథ్యంలో రైతులు ఖర్చులు తగ్గించుకోవ డం, నూతన విధానాలపై ఆసక్తి చూపడం, యాంత్రీకరణ వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక విధాలుగా అండగా ఉంటూ సాగుపరంగా ప్రోత్సహిస్తున్నది. కానీ, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, ఇతరత్రా కారణాలతో ఒక్కోసారి ఆశించిన దిగుబడులు రాక రైతులు ఆర్థికంగా చితికి పోతున్నా రు. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పద్ధ్దతు ల్లో పంటలను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నా రు. ఇటీవలి కాలంలో ‘వెదజల్లే’ విధానంలో వరి సా గుపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో పాటు వ్యవసాయశాఖ అధికారులు ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో పలుచోట్ల రైతులు ఈ విధానం అవలంబించేందుకు ముందుకు వస్తున్నా రు. మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన రైతులు మంతెన మహిపాల్‌రెడ్డి ‘వెదజల్లె’ విధానంలో యాసంగిలో వరి పంటను సాగుచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
6 ఎకరాల్లో ‘వెదజల్లె’ పద్ధ్దతిలో వరిసాగు..
రైతు మహిపాల్‌రెడ్డి తనకున్న 11 ఎకరాలకు గాను 6ఎకరాల్లో వెదజల్లె పద్ధ్దతిలో వరి సాగు చేస్తున్నాడు. గతేడాది ఆరు ఎకరాల్లో వరిని నాటేసేందు కు కూలీలకు సుమారు రూ. 50వేల ఖర్చు రావడం తోపాటు పదిహేను రోజుల సమయం పట్టింది. దీంతో నాటేసే విధానంతో విసిగిన మహిపాల్‌రెడ్డి, ఇటీవల వెదజల్లె విధానంపై కథనాలు రావడంతో ఆ విధానంలో వరిని సాగుచేసేందుకు ఆసక్తి పెంచుకున్నాడు. వెదజల్లె విధానంతోపాటు స్వతహాగా తయా రు చేసుకున్న డ్రమ్ సీడర్‌తో వరిని సాగుచేశాడు. ప్రస్తుతం పొలంలో నారు మొలకెత్తి పచ్చగా కనిపిస్తుండడంతో రైతు మహిపాల్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. వెదజల్లె పద్ధతిలో వరి పంట మంచిగా దిగుబడి వస్తే, తాము ఈ పద్ధతిలోనే సాగు చేస్తామ ని నర్సాయపల్లి గ్రామ రైతులు చెబుతున్నారు.
నారుమడి విధానం..
సాధారణంగా రైతులు వరి సాగుకు ముందు నారుమడిని సిద్ధ్దం చేసుకుంటారు. వెదజల్లె విధా నంలో పొలం మొత్తాన్ని నారుమడిగా పాటించా లి. నారుమడికి ముందు రైతులు ఏవిధంగా విత్తనపు వడ్లను నానబెట్టి మూడ్రోజుల తర్వాత ఏ విధంగా వెదజల్లుతారో అలాగే పొలం మొత్తంలో వెదజల్లితే రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు త గ్గుతుంది. ముఖ్యంగా ఈ విధానం ద్వారా రైతుకు కూలీల ఖర్చు రూ.6వేలతో పాటు దున్నకం ఖర్చు లు, ఎరువుల వినియోగం తగ్గడంతో మరో రూ. 4వేలు ఆదా అవుతుంది. వెదజల్లె విధానంలో సాగు చేసిన పంటను చీడపురుగులు ఆశించవని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కూలీల బాధ తప్పింది.
ఏటా యాసంగి లో 6 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నా. నా టు వేసేందుకు కూ లీల కోసం రూ. 50 వేల వరకు ఖర్చు అ వుతున్నది. ఒక్కోసా రి సమయానికి కూలీలు దొరక్క వరినాట్లు ఆలస్యం కావడంతో పంట దిగుబడిపై చాలా ప్రభావం చూపాయి. అందుకనే ఈ ఏడాది ‘వెదజల్లె’ పద్ధ్దతిలో వరిని సాగుచేస్తే బాగుంటుందని ముందుకు వచ్చా. నేను చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయితే, మిగ తా రైతులు ఈ విధానంలో వరిని సాగు చేయాలని ప్రత్యేకంగా ప్రచారం చేస్తా.
- మంతెన మహిపాల్‌రెడ్డి (రైతు, నర్సాయపల్లి)
తాజావార్తలు
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు