బాలుర కిడ్నాప్

రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్
గుర్తు పట్టడంతో వదిలివెళ్లిన దుండగులు
సిద్దిపేటలో కలకలం
సిద్దిపేట టౌన్, జనవరి 11 : మానవత్వ విలువలు మంట గలుస్తున్నాయి. పైసల కోసం నేరప్రవృత్తిలోకి వెళ్తున్నారు. పిల్లలను ఎత్తుకెళ్లి లక్షలు అర్జించాలని పథకం పన్నారు. ఆడుకుంటున్న ఇద్దరు స్నేహితులను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. అందులో ఒకరిని గుర్తు పట్టడంతో గుట్టు రట్టయ్యిందని తెలిసి ఇద్దరు బాలురను అక్కడే వదిలి పారిపోయిన సంఘటన సిద్దిపేట టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని పారుపల్లి వీధికి చెందిన మురికి వేణుగోపాల్ అనే వ్యాపారి కుమారుడు మనీష్ (15) ఆదివారం సైకిల్‌పై శరభేశ్వర దేవాలయం వద్ద ఉండే అతడి స్నేహితుడు రిత్విక్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఇద్దరు పిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అయ్యప్ప స్వామి ఆలయ వెనుకభాగం వ్యవసాయ పొలాల వద్ద ఇద్దరు చేతులను కట్టేశారు. మనీష్ దగ్గర ఉన్న ఫోన్‌ను లాక్కొని తండ్రి వేణుగోపాల్‌కు ఫోన్ చేశారు. పిల్లలను కిడ్నాప్ చేశాం.. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చంపుతామని బెదిరించారు. కరోనా సమయంలో డబ్బులు లేవని.. తమ పిల్లలను విడిచిపెట్టాలని వేడుకున్నారు. కిడ్నాప్ చేసిన వారిలో ఒక వ్యక్తిని మనీష్ గుర్తుపట్టి చందు-చందు అని పిలిచాడు. దీంతో కిడ్నాపర్లు తమను గుర్తుపట్టారని గ్రహించి మనీష్ వద్ద ఉన్న విలువైన ఫోన్‌తో అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్న ఓ రైతు పిల్లల అరుపులు విని దగ్గరకు వెళ్లి చూడగా కట్లతో కిందపడి ఉన్నారు. వెంటనే అతడి ఫోన్ నుంచి వేణుగోపాల్‌కు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ప్రియుడి కోసం సాయిపల్లవి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
- పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
- కాంగ్రెస్‌లో చేరిన నాథురాం గాడ్సే భక్తుడు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురుతో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్