మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Jan 11, 2021 , 00:09:43

కుటుంబీకులకు యువకుడి అప్పగింత

కుటుంబీకులకు యువకుడి అప్పగింత

సిద్దిపేట టౌన్‌, జనవరి 10 : పది రోజులుగా కనిపించకుండాపోయిన మందబుద్ధి కలిగిన యువకుడిని కుటుంబీకులకు అప్పగించి, ఆ కుటుంబంలో పోలీసులు ఆనందాన్ని నింపారు. సిద్దిపేట టూటౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట డైమండ్‌ హోటల్‌ వద్ద ఓ యువకుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్‌ అశోక్‌, హోంగార్డు అజ్జు అక్కడకు వెళ్లి, ఆ యువకుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆరా తీయగా, తన పేరు మోహన్‌రావు అని, శ్రీకాకుళం జిల్లా కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిపాడు. దీంతో ఫోన్‌ నంబర్‌ తీసుకొని, వారి బంధువులకు ఫోన్‌ చేశారు. వారి కుటుంబీకులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 29న రైలులో హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా రాజమండ్రి వద్ద రైలు దిగి కనిపించకుండావెళ్లినట్లు వివరించారు. అనంతరం మోహన్‌రావును తీసుకెళ్లారు. 

VIDEOS

logo