మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Jan 11, 2021 , 00:10:02

రాతికళా తోరణానికి త్రివర్ణ శోభ

రాతికళా తోరణానికి త్రివర్ణ శోభ

రూ.5 లక్షల నిధులతో బురుజుకు ఆధునిక హంగులు 

వేగంగా కొనసాగుతున్న పనులు 

సిద్దిపేట టౌన్‌, జనవరి 10 : చారిత్రక రాతికళా తోరణం బురుజు త్రివర్ణ శోభను సంతరించుకుంటుంది. ప్రభుత్వం బురుజుకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నది. సిద్దిపేటకు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్న చారిత్రక రాతికట్టడం బురుజుకు ఆధునిక హంగులను సమకూర్చేందుకు రూ.5లక్షలను ప్రభుత్వం కేటాయించింది.  

 బురుజుకు ఆధునిక హంగులు 

సిద్దిపేటలో సుమారు 300 ఏండ్ల  కింద నిర్మించిన రాతికళా తోరణం బురుజు ఆధునిక హంగులను సంతరించుకుంటుంది. బురుజు నిర్మాణం చుట్టూ అక్కడక్కడ మట్టి ఊడి గ్యాబ్‌లు ఏర్పడ్డాయి. మంత్రి హరీశ్‌రావు మున్సిపల్‌ నుంచి రూ.5 లక్షల నిధులు కేటాయించారు. దీంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.  గణతంత్య్ర దినోత్సవం రోజున జెండాను ఎగురవేసేలా అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. 

VIDEOS

logo