శనివారం 06 మార్చి 2021
Siddipet - Jan 10, 2021 , 00:07:56

గుండెపోటుతో రేషన్‌డీలర్‌ మృతి.. తలకొరివి పెట్టిన తల్లి

గుండెపోటుతో రేషన్‌డీలర్‌ మృతి.. తలకొరివి పెట్టిన తల్లి

మద్దూరు, జనవరి 9 : మండలంలోని వల్లంపట్ల గ్రామ రేషన్‌ డీలర్‌ గజ్జెల ప్రభాకర్‌రెడ్డి(50) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఇరవై ఏండ్లుగా ప్రభాకర్‌రెడ్డి గ్రామంలో రేషన్‌ డీలర్‌గా సేవలందిస్తున్నాడు. డీలర్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు.   గ్రామ సర్పంచ్‌ ఆలేటి రజిత, ఎంపీటీసీ గూళ్ల సత్యకళ, రేషన్‌ డీలర్ల సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ కరీం, దాసరి వేణుగోపాల్‌లు సంతాపాన్ని తెలిపారు.

మండలంలోని వల్లంపట్లలో గుండెపోటుతో మృతి చెందిన ప్రభాకర్‌రెడ్డికి, ఆయన తల్లి తలకొరివిపెట్టింది. మృతుడి తండ్రి గజ్జెల నారాయణరెడ్డి 30 ఏండ్ల కిందే మృతి చెందాడు. ప్రభాకర్‌రెడ్డి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో కొడుకు వద్దే తల్లి లలితమ్మ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో కొడుకు గుండెపోటుతో మృతిచెందడంతో కొడుకుకు ఎనబైఏండ్ల తల్లి లలితమ్మ తలకొరివిపెట్టి, రోదించిన తీరు చూపరులను కంటనీరు పెట్టించింది.


VIDEOS

logo