అనుమతి రాగానే దశల వారీగా అందరికీ టీకా

- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట కలెక్టరేట్, జనవరి 8 : ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ విజయవంతంగా కొనసాగింది. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని నాసరపుర ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ తీరును మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పరిశీలించారు. డ్రై రన్ తీరును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి, కలెక్టర్‌కు వివరించారు. టీకా పంపిణీకి సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
డ్రైరన్ విజయవంతం..:
- జిల్లా వైద్యాధికారి మనోహర్
సిద్దిపేట జిల్లా దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు మొత్తం 21 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించామని జిల్లా వైద్యాధికారి మనోహర్ తెలిపారు. మొత్తం 360 మంది హెల్త్‌కేర్ వర్కర్స్‌పై డ్రై రన్ చేపట్టారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డ్రై రన్ విజయవంతమైందన్నారు. టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడంతో పాటు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. డ్రై రన్లో గమనించిన సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా వైద్యాధికారి వెల్లడించారు.
తాజావార్తలు
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాభివృద్ధి
- కాళేశ్వరం చేరుకున్న వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు
- అంతర్జాతీయ విమానాలపై నిషేధం : మార్చి 31 వరకూ పొడిగింపు!
- 2021 న్యూ జియో ఫోన్.. రెండేండ్ల వరకు అన్లిమిటెడ్ సర్వీస్ ఆఫర్!
- అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై మమత అసంతృప్తి
- ఐదు సినిమాలకు ఆదాశర్మ సంతకం