ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Jan 09, 2021 , 00:22:37

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

  • 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ  
  • హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

హుస్నాబాద్‌, జనవరి 8: త్వరలో జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమయ్యే నియోజకవర్గ యువతకు  సొంత ఖర్చులతో శిక్షణ ఇవ్వనున్నట్లు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన  మాట్లాడుతూ నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కన్నారం, ఎర్రవెల్లి గ్రామాల యువత  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కానిస్టేబుల్‌, ఎస్సై, గ్రూప్‌ 1, 2, 3, 4, బ్యాంకింగ్‌, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ పరీక్షలకు ఫౌండేషన్‌ కోర్సు ద్వారా రెండు నెలల పాటు అన్ని సబ్జెక్టుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. 

28న అర్హత పరీక్ష..

ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు హుస్నాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలోని పాత మీటింగ్‌ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 28న హుస్నాబాద్‌లోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో ఉదయం 11  నుంచి ఒంటి గంట వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  పరీక్షల్లో వచ్చిన మార్కులు ఆధారంగా 250 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షల్లో విశేష అనుభవం ఉన్న హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో  శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వివరాలకు 7989332923 నంబర్‌ను సంప్రదించాలన్నారు. 

VIDEOS

logo