సోమవారం 01 మార్చి 2021
Siddipet - Jan 09, 2021 , 00:22:35

ముదిరాజ్‌ల అభ్యున్నతికి సర్కారు కృషి

ముదిరాజ్‌ల అభ్యున్నతికి సర్కారు కృషి

  • మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి

దుబ్బాక టౌన్‌, జనవరి 8: రాష్ట్రంలోని ముదిరాజ్‌ల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలో స్థానిక ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పెద్దమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ దేవి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఆలయ నిర్మాణానికి నిధులను అందజేసిందని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.  అందుకు ముందు ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ముదిరాజ్‌ సంఘం పెద్దలు, పురోహితులు  ఘన స్వాగతం పలికారు. దేవి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు పాటు ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితభూంరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. 

VIDEOS

logo