మల్లన్న కల్యాణానికి ముమ్మర ఏర్పాట్లు

చేర్యాల, జనవరి 7 : ఈ నెల 10న జరుగనున్న కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మల్లన్న క్షేత్రంలో పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఆరా తీస్తూ, ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే విలేకరులతో మాట్లాడారు. మల్లన్న కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ, ప్రభుత్వశాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ పద్మాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారన్నారు. స్వామి వారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయ ఈవోతో పాటు కింది స్థాయి అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో పని చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, జడ్పీటీసీ సిద్ధప్ప, ఎంపీపీ తలారీ కీర్తనాకిషన్, సర్పంచ్ సార్ల లతాకిష్టయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ బత్తిని నర్సింహులు, మల్లన్న ఆలయ మాజీ డైరెక్టర్ ముత్యం నర్సింహులు, టీఆర్ఎస్వీ నాయకుడు ఏర్పుల మహేశ్, ఏఈవో వైరాగ్యం అంజయ్య తదితరులున్నారు.
తాజావార్తలు
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్