స్వచ్ఛతపై అవగాహన పెంపొందించాలి

గజ్వేల్ అర్బన్, జనవరి 7 : పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన పెంపొందించాలని మెప్మా ఆర్పీలకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం గజ్వే ల్ పట్టణంలో స్త్రీల మరుగుదొడ్లను ప్రారంభించిన సందర్భంగా మెప్మా మహిళా సిబ్బందితో మంత్రి మాట్లాడారు. పెండింగ్ వేతనాలు అందాయా? అని వాకబు చేశారు. సిద్దిపేట జిల్లాలోని మెప్మా సిబ్బంది వేతనాలను వేశామని గుర్తు చేశారు.
ప్రత్యేక భవనాలు కావాలని వినతులు.!
గజ్వేల్ పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు వివిధ సమస్యలపై వినతుల వెల్లువ కొనసాగింది. గజ్వేల్ మండల జడ్పీటీసీ, ఆర్ఎంపీల అధ్యక్షుడు పంగ మల్లేశం ఆధ్వర్యంలో ఆర్ఎంపీలు మంత్రి హరీశ్‌రావును కలిసి తమ సంఘానికి భవనం ఏర్పా టు చేయాలని కోరారు. ఈ విషయంపై ఆర్డీవో, గడా ప్రత్యేకాధికారి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదే శించారు. ఎరుకల సంఘం భవనం నిర్మించాలని ఏఎంసీ డైరెక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎరుకుల కుల స్తులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. గజ్వేల్ పట్టణంలో గ్రంథాలయాలను విస్తరించి, నూతన భ వనాలను ఏర్పాటు చేయాలని యువజన సంఘాల రాష్ట్ర నాయకుడు దేశబోయిని నర్సింహులు కోరారు.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు