క్రీడాభివృద్ధికి కృషి చేయాలి

సిద్దిపేట కలెక్టరేట్, జనవరి 7 : జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచే జిల్లాకు చెందిన క్రీడాకారులు, కోచ్‌లకు రూ.25 వేల నగదు పారితోషికం అందజేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీఇచ్చారు. క్రీడా క్యాలెండర్ తయారు చేయాలని క్రీడా సం ఘాల ప్రతినిధులకు మంత్రి మార్గదర్శనం చేశారు. సిద్దిపేట మినీ స్టేడియంలో బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లాలో క్రీడాభివృద్ధికి క్రీడా సంఘా ల, ప్రభుత్వ, ప్రైవేట్, వ్యాయామ ఉపాధ్యాయులతో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్లబ్ జిల్లా సమన్వయకర్త, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు.. క్రీడాభివృద్ధికి దిశా నిర్దేశం చేశారు. సిద్దిపేట స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ ఏర్పాటు చేసి క్లబ్ ద్వారా ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని ప్రతినిధులను కోరారు. క్రీడాసౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, క్రీడామైదానాల్లో క్రీడాకారులు, కోచ్‌లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తానని హామీ ఇచ్చారు.
సింథటిక్ కోర్టులు, సౌకర్యాలు, టాయిలెట్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్ ఏర్పాటు చేయిస్తానని, పీఈటీలకు ప్రోత్సా హం ఇస్తామన్నారు. రూ.5 కోట్లతో నిర్మించిన స్విమ్మింగ్‌పూల్ సద్వినియోగపర్చేలా కృషి చేయాలన్నారు. రూ.కోటి వ్యయంతో పుట్‌బాల్ కోర్టు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మా ణం ముఖ్యం కాదని.. నిర్వహణ.. సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమన్నారు. క్రీడా సంఘాల మధ్య సమన్వయసహకారం ఉండాలని, స్టేడియంలో కనీసం వెయ్యి మందితో యోగా సాధన జరగాలని, క్రీడాపోటీలపై కమిటీ వేసి ప్రతి యేటా 2 నుంచి 3 క్రీడా పోటీలకు సిద్దిపేట వేదికగా నిలువాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు