సోమవారం 08 మార్చి 2021
Siddipet - Jan 07, 2021 , 00:04:56

రెండు తలల పామును దాచిన నిందితుల పట్టివేత

రెండు తలల పామును దాచిన నిందితుల పట్టివేత

సిద్దిపేట టౌన్‌, జనవరి 6 : రెండు తలల పామును పట్టుకొని దాచి ఉంచిన నింది తులను సిద్దిపేట పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వారి వద్దనుంచి పాము ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ నర్సింహారావు, వన్‌టౌన్‌ సీఐ సైదులు వివరాల ప్రకారం కాశవేణి తిరుపతి, వడ్డె శ్రీరాములు, వెంకటేశ్‌ నాగదేవత ఆలయ శివారులో రెండు తలల పామును పట్టుకొని దాచి ఉంచారన్న నమ్మదగిన సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు సిబ్బందితో వెళ్లి వారు వేసుకున్న గుడారాల్లో తని ఖీలు చేపట్టారు. డబ్బాలో దాచి ఉంచిన పాము లభించింది. పామును స్వాధీనం చేసుకొని వారిని విచా రించగా ఇంట్లో పాము ఉండడం వల్ల ధనం, ఆరోగ్యం బాగుం టాయని కొందరి నమ్మకమని చెప్పారు. అలాంటి వారు పాము లను ఎంతకైనా కొనేందుకు వస్తారని, వారి కోసమే పామును పట్టుకొని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ముగ్గురు నిందితులపై వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు తెలి పారు. పట్టుకున్న పామును అటవీ శాఖ అధికారులకు అప్ప గించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ మాట్లాడుతూ వన్య ప్రాణులను పట్టుకొని బంధించినా, వేటా డినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై రాజేశ్‌, సిబ్బంది శివకుమార్‌, నర్సింహు లు, రాములు, సతీశ్‌, సాయిబాబా, కమలాకర్‌రెడ్డి, నాగరాజు  పాల్గొన్నారు. 

VIDEOS

logo