ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Jan 07, 2021 , 00:06:33

విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి

విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి

జగదేవ్‌పూర్‌, జనవరి 6 : చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనా లు ఆసరాగా నిలుస్తాయని జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ప్రతినిధి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మండలంలోని తీగుల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో జాతీయ ఉపకార వేతనాలకు సన్నద్దమయ్యే 8, 10వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌ స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉపకార వేతనాలు పొందడానికి అర్హత సాధించి, తద్వారా పాఠశాలతోపాటు తల్లిదండ్రులకు గుర్తింపు తేవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ చదివి ఉన్నతస్థాయికి చేరాలని, ఇందుకు జీఎంఆర్‌ పౌండేషన్‌ ఆండగా ఉంటుందన్నారు.  

 విద్యార్థినికి ‘భూలక్ష్మి’ ట్రస్టు చేయూత 

నంగునూరు, జనవరి 6 : ప్రతిభావంతులైన విద్యార్థులను భూలక్ష్మి మెమోరియల్‌ ట్రస్టు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ట్రస్టు వ్యవస్థాపకుడు, ఉపాధ్యాయుడు శనిగరం కనకయ్య అ న్నారు. మండల కేంద్రం నంగునూరులో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వేముల లిఖితకు డిక్షనరీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ర్థులు చదువుపై శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థి లిఖితను ప్రోత్సహించేందుకు ఇంగ్లిష్‌ డిక్షనరీ అందజేశామని తెలిపారు. 

VIDEOS

logo