ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 07, 2021 , 00:06:42

నిరుపేదలకు ఖరీదైన వైద్య పరీక్షలు

నిరుపేదలకు ఖరీదైన వైద్య పరీక్షలు

డయాగ్నోస్టిక్‌ హబ్‌లో నిర్వహించే వైద్య పరీక్షలు 

రూ.2.50 కోట్లతో  డయాగ్నోస్టిక్‌ సెంటర్‌

57 రకాల వ్యాధులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు

త్వరలో సిద్దిపేట జిల్లాలో అందుబాటులోకి.. 

కార్పొరేటర్‌ దవాఖానలకే పరితమైన ఖరీదైన వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి పేదలకు  రోగ నిర్ధారణ పరీక్షలు  ఉచితంగా చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఆలోచన మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేటలో ఖరీదైన అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. రూ.2.50 కోట్లతో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ సేవలు వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. త్వరలో సిటీ స్కాన్‌, డయాగ్నోస్టిక్‌ సేవలు అందుబాటులోకి రానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 6 : కార్పొరేట్‌ దవాఖానలకే పరిమితమైన ఖరీదైన వైద్య పరీక్షలన్నీ నిరుపేదలకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి పేదలకు అన్ని రకాలైన రోగ నిర్ధారణ పరీక్షలు సిద్దిపేటలో అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య సమస్యతో ఏ వైద్యుడి వద్దకు వెళ్లిన వెంటనే అతడు సిఫారసు చేసేది మొదట వైద్య పరీక్షలకే. కొన్ని సార్లయితే ఒకటికి మించి రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాల్సి వస్తున్నది. వైద్య పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రోగ నిర్ధారణ పరీక్షలు పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలకే అధికంగా వెచ్చించాల్సి వస్తున్నది. దీంతో ప్రజలు అప్పుల పాలవతున్నారు. మరికొందరు పరీక్షలు చేసుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఆలోచన మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేటలో ఖరీదైన అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. రూ.2.50 కోట్లతో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ సేవలు వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. మరో నెల రోజుల్లో రూ.2.52 కోట్లతో సిటీ స్కాన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. అల్ట్రాసౌండ్‌, 2డీ ఎకో సేవలు సైతం అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు భావిస్తున్నారు. ఖరీదైన డయాగ్నోస్టిక్‌ సేవలు అందుబాటులోకి వస్తే జ్వరం, దగ్గు, షుగర్‌, బీపీ వంటి 57 రకాల వ్యాధులకు సంబంధించి ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి రిపోర్టు ఇచ్చే సౌల భ్యం కలుగుతున్నది. అందుకు సంబంధించి ట్రయల్‌ రన్‌ కొనసాగుతున్నది. సిటీ స్కాన్‌ సేవలు అందుబాటులోకి వస్తే తల, శరీరం, ప్రమాదాలకు గురైనప్పుడు తగిలే దెబ్బలకు స్కానింగ్‌ రిపోర్టు ఉచితంగా పొందే ఆస్కారం ఉంటుంది. ప్రైవేట్‌ దవాఖానల్లో ఈ సేవలకు ప్రజలు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడంతో వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి సరైన వైద్యం అందించేందుకు వీలు కలుగుతున్నది. త్వరలో సిటీ స్కాన్‌, డయాగ్నోస్టిక్‌ సేవలు అందుబాటులోకి రానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ హబ్‌ ఏర్పాటుతో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నిర్వహించే పరీక్షలు ఏ/జీ రేషియో, బ్లడ్‌ యూరియా, నైట్రోజన్‌, డైరెక్టర్‌ ఎల్‌డీఎల్‌, ఫాస్టింగ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌, జీజీటీ, గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్టు, హెచ్‌బీఏ1సి, ఎల్‌డీఎల్‌/హెచ్‌డీఎల్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌, లివర్‌ పంక్షన్‌ టెస్టు, పోస్టు లంచ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌, రాండమ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌, రీనల్‌ పంక్షన్‌ టెస్టు, ఎస్‌ బిల్‌రుబిన్‌ డీ, ఎస్‌ బిల్‌రుబిన్‌ టీ, ఎస్‌ కాల్షియం, ఎస్‌ లాక్టెట్‌ ఎల్‌డీహెచ్‌, ఎస్‌.ఎల్‌డీఎల్‌, ఎస్‌.టోటల్‌ కోలోస్ట్రాల్‌, ఎస్‌.టోటల్‌ ప్రోటీన్‌, ఎస్‌.ట్రైైగ్లెసిరెడ్స్‌, ఎస్‌.యూరిక్‌ యాసిడ్‌, సిరమ్‌ ఎలక్ట్రోలైట్స్‌, ఎస్‌జీవోటి/ఏఎస్‌టీ, ఎస్‌జీపీటీ/ఏఎల్‌టీ, టీ.కోల్‌/హెచ్‌డీఎల్‌, టి3. టోటల్‌, టీ4 టోటల్‌, థైరాయిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ స్టిములిటింగ్‌ హార్మోన్‌, ఎస్‌.ఆమైలెస్‌, ఎస్‌.క్రియోటినైన్‌, ఎస్‌.హెచ్‌డీఎల్‌, ఎస్‌.ఆల్బోమిన్‌, ఎస్‌. ఆల్కలిన్‌పాస్‌పోటేస్‌, ఆబ్సోల్యూట్‌ ఎసోనొపిల్‌ కౌంట్‌, కంప్లీట్‌ బ్లడ్‌ ప్రషర్‌, కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌, కూబ్స్‌ టెస్టు డైరెక్ట్‌, కూబ్స్‌ టెస్టు ఇన్‌డైరెక్ట్‌, డిఫరెన్సియల్‌ లూకోసైట్‌ కౌంట్‌, ఎరిత్రోసైట్‌ సెడిమెంటేషన్‌ రేట్‌, పాక్‌డ్‌ సెల్‌ వాల్యూమ్‌, పేక్‌డ్‌ సెల్‌ వాల్యూమ్‌, ప్లేట్‌లెట్‌ కౌంట్‌, రెటిక్యూలోసైట్‌ కౌంట్‌, స్టూల్‌ ఫర్‌ అకౌంట్‌ బ్లడ్‌, టోటల్‌ ల్యూకోసైట్‌ కౌంట్‌, టోటల్‌ రెడ్‌ బ్లడ్‌ సెల్‌ కౌంట్‌, సిరమ్‌ ఐరన్‌ (ఐపీఎం), యూఐబీసీ (ఐపీఎం), విటమిన్‌ డీ3 (ఐపీఎం) వీటితో పాటు మలేరియా పరీక్షలు కూడా చేయనున్నారు. 

 నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గిస్తాం

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అతి భారమైనవి వైద్య ఖర్చులే. ఏ చిన్న ఆరోగ్య సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్లినా పలురకాల వైద్య పరీక్షలకు రాస్తారు. అవన్నీ చేయించుకోవాలంటే పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతున్నది. నిరుపేదలపై ఆర్థిక భారం తగ్గించే క్రమంలోనే సిద్దిపేటలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సంకల్పించాం. అధునాతన డయాగ్నోస్టిక్‌, సిటీ స్కాన్‌ సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకొ స్తాం. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 40 దవాఖానల్లో రక్త పరీక్షలకు ఇస్తే 24 గంటల్లో రోగులకు ఫలితాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రిపోర్ట్‌ ప్రింట్‌ను ఉచితంగా రోగులకు అందిస్తాం. రోగుల సెల్‌ఫోన్‌కు సైతం పరీక్షా ఫలితాలు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.  

-తన్నీరు హరీశ్‌రావు,  ఆర్థిక శాఖ మంత్రి 

VIDEOS

logo