నిధులు తెస్తే పొర్లుదండాలు పెడుతా

- తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల,జనవరి 5 : తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి న్యాయపరంగా రావాల్సిన రూ. లక్షా 35వేల కోట్లను బీజేపీ అగ్రనేతలు తీసుకువచ్చి రాష్ర్టాభివృద్ధిలో పాలుపంచుకుంటే టీఆర్ఎస్ నేతలు పొర్లు దండాలు పెడ్తారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని ఆకునూరు గ్రామంలో మిష న్ భగీరథ నిధులు రూ.17లక్షల వ్యయంతో నిర్మించే నీటి ట్యాంకు నిర్మాణ పనులను ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, సర్పంచ్ చీపురు రేఖతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నేతలు ఒక్క పైసా కేంద్రం నుంచి తీసుకురాలేదని, ఉమ్మడి రాష్ట్రంలో అన్ని విధాలుగా దోపిడీకి గురైన తెలంగాణను సమగ్రాభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు పన్నుల రూపం లో కేంద్రానికి చెల్లించిన రూ.2లక్షల 35వేల కోట్ల నుంచి రాష్ర్టానికి కేంద్రం నుంచి న్యాయపరంగా రావాల్సిన నిధులను మంజూరు చేయాలని దేశ ప్రధానికి సీఎం కేసీఆర్ కలిసి దండం పెట్టి అడిగితే దానిని బండి సంజయ్ రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికలో సమయంలో టీఆర్ఎస్ ఏమరుపాటుతో ఉండడంతో విజయం సాధిస్తే ఏదో గొప్ప విజయం సాధించినట్లు బీజేపీ నాయకులు వాపును చూసి మరేదో అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో జరుగబోయే నాగార్జునసాగర్‌తో పాటు ఖమ్మం, వరంగల్, సిద్దిపేట మున్సిపాల్టీలలో ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కడుతారని తెలిపారు. ప్రవహించే నదిని ఎదురుపారించి కరువు ప్రాంతాల్లోనే రిజర్వాయర్లు కడుతున్న సీఎం కేసీఆర్ మేధస్సు ఎంతో గొప్పదని, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయన్నారు. పార్లమెంట్ సాక్షిగా సీఎం కేసీఆర్‌ను దేశ ప్రధాని మోడీ ప్రశంసించిన విషయాన్ని మరిచి బీజేపీ రాష్ట్ర నేతలు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జనగామ నియోజకవర్గంలో 102 గ్రామాలున్నాయని, గత 60 సంవత్సరాల కాలంలో నాటి పాలకులు 165 ట్యాంకులు నిర్మిస్తే టీఆర్ఎస్ సర్కారు పగ్గాలు చేపట్టిన అనంతరం కేవలం 5 సంవత్సరాల్లో 365 ట్యాంకులు నిర్మించి మహిళలకు తాగు నీటి కష్టాలు తీర్చినట్లు తెలిపారు. రూ.68లక్షలతో మండలంలోని ఆకునూరు, గుర్జకుంట, పోతిరెడ్డిపల్లి, వీరన్నపేట, కొమురవెల్లి మండలంలోని మర్రిముచ్చాలలో నీటి ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుంకరి శ్రీధర్, ఉపసర్పంచ్ బోయిని పద్మ, వార్డు సభ్యులు తాటికొండ సదానందం, రణం ప్రశాంత్, నర్సమ్మ, మాజీ ఎంపీటీసీ తాటికొండ వేణు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వంగాల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కోతి దాసు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకుడు శివగారి అంజయ్య, తాడెం కృష్ణమూర్తి, కంతుల రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు