పల్లెలకు ‘శుభ సౌకర్యం’

- సౌకర్యవంతంగా సర్కారు పెండ్లి మండపాలు
- సామాన్యుడికి తగ్గట్టు తక్కువ అద్దె
- ఫంక్షన్ హాళ్లలో రోజూ పెండ్లిబాజా
- సిద్దిపేట జిల్లాలో రద్దీగా మారిన ఎర్రవల్లి, దిలాల్పూర్ ఫంక్షన్ హాళ్లు
గజ్వేల్, జనవరి 4: గ్రామాల్లో శుభకార్యాలు నిర్వహిం చడానికి ప్రభుత్వ ఫంక్షన్ హాళ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో వీటిని నిర్మిస్తుండగా, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. పేద, మధ్య తరగతి, ధనవంతులు సైతం ప్రభుత్వ పెండ్లి మండపాలను వినియోగించుకుంటున్నారు. ప్రైవేట్ పెండ్లిమండపాల్లో వివాహాలు నిర్వహించుకోవడానికి చాలా మంది మధ్య తరగతి, పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రభుత్వం ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లకు దీటుగా అన్ని సౌకర్యాలతో నిర్మించారు. జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి ఫంక్షన్ హాల్లో ఇప్పటికే అత్యధిక విహహాలు జరుగగా, గతేడాది చివరలో అందుబాటులోకి వచ్చిన దిలాల్పూర్ ఫంక్షన్ హాల్ కూడా రద్దీగా మారింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ మండపాలు నామమాత్రం అద్దె వసూలు చేస్తుండగా, గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి శుభకార్యాలు చేసుకునే వారికి ఇప్పుడు స్థానికంగానే అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఎర్రవల్లి ఫంక్షన్ హాల్లో 350కి పైగా పెండ్లిలు..
సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వం మొట్టమొదట మర్కూక్ మం డలం ఎర్రవల్లిలో ఫంక్షన్ హాల్ నిర్మించింది. 2016 డిసెంబర్ 23వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఫంక్షన్ హాల్ ప్రైవేట్‌కు దీటుగా మారడంతో, ఉమ్మడి మెదక్ జిల్లాలోని మిగతా గ్రామాల్లో నిర్మించడానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇప్పటి వరకు సుమారు 350 వివాహాలు జరిగాయి. ధనవంతుల పెండ్లిలు కూడా పెద్ద సంఖ్యలో జరుగగా, పేద పెండ్లి జంటకు ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి ఆర్థిక సహాయం కూడా కలిసి రావడం గమనార్హం. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రూ.75 వేలు అద్దె చెల్లించినా.. ఇన్ని సౌకర్యంగా ఉండదంటున్నారు. అద్దె నిర్వహణ ఖర్చుల కోసం ప్రతి పెండ్లికి తొలుత రూ.5వేలు వసూలు చేశారు. ఆ తర్వాత రూ.10 వేలు, ఇప్పుడు రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. పేదల పెండ్లికి పలు రకాలు సహకారం అందిస్తున్నారు.
దిలాల్పూర్ ఫంక్షన్ హాల్లో పెరిగిన రద్దీ..
గజ్వేల్ మండలం దిలాల్‌పూర్‌లో గతేడాది నవంబర్ నెలలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. సుమారు రూ.1.50 కోటి వ్యయంతో నిర్మించిన ఈ మండపంలో 45 రోజుల్లోనే 10 పెండ్లిలు జరిగాయి. మారుమూల గ్రామంలో సౌకర్యవంతంగా నిర్మించడంతో మంచి ఆదరణ పొందుతున్నది. ప్రతి పెండ్లికి రూ.20 వేలు తీసుకుని ఆ డబ్బును ఫంక్షన్ హాల్ అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. పక్కనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం, చుట్టూ అందమైన ప్రకృతి సౌందర్యంతో ఫంక్షన్‌హాల్ అందరికీ సౌకర్యవంతంగా మారింది. గజ్వేల్ ముస్లిం షాదీఖాన, క్రిస్టియన్ భవన్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న పెండ్లి మండపాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే గ్రామాలు శుభకార్యాలకు నిలయాలుగా మారుతాయి.
350 పెండ్లిలు జరిగాయి
మా ఊరును కొత్తగా నిర్మించిన తర్వాత ఫంక్షన్‌హాల్‌ను కూడా నిర్మించారు. స్వయంగా సీఎం కేసీఆర్ అందించిన గొప్పసౌకర్యం. ఇప్పటి వరకు 350 పెండ్లిలు ఈ ఫంక్షన్ హాల్లో జరిగాయి. పేద, మధ్య తరగతితో పాటు ధనవంతులు కూడా ఫంక్షన్ హాల్లో శుభకార్యాలు జరుపుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. మూడున్నర ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నిర్మించారు. నామమాత్రం అద్దె వసూలు చేయడంతో పేద కుటుంబాలకు ఎంతో బాసటగా నిలుస్తున్నది. ఇంట్లో పెండ్లి చేసుకున్నా ఇంతకన్నా నాలుగింతల ఖర్చు వస్తుంది.
-తుమ్మ కృష్ణ, ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు, ఎర్రవల్లి
గొప్ప సౌకర్యం
మా గ్రామానికి సీఎం కేసీఆర్ అద్భుత సౌకర్యం అందించడంతో కష్టపడి ముం దుగా ఫంక్షన్ హాల్‌ను నిర్మించాం. ఇం తకుముందు గజ్వేల్, సిద్దిపేట, తదితర ప్రాంతాల్లో పెండ్లిలు చేసుకునేవారు. ఇప్పుడు పేద, మధ్య తరగతి వారు కూడా ఫంక్షన్ హాల్లో శుభకార్యాలు జరుపుకుంటున్నారు. గ్రామాల్లో నిర్మించడంతో సౌకర్యవంతంగా మారాయి. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో తొందరగా నిర్మించగలిగాం.
-దివ్యా దయాకర్‌రెడ్డి, సర్పంచ్ దిలాల్పూర్
తాజావార్తలు
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
- నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన
- డబ్ల్యూటీసీలో టీమ్ఇండియా నంబర్‌వన్
- నితిన్ నమ్మకాన్ని చంద్రశేఖర్ యేలేటి నిలబెడతాడా..?