శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Jan 04, 2021 , 00:13:41

స్వశక్తితో సగర్వంగా

స్వశక్తితో సగర్వంగా

  • ఆత్మైస్థెర్యంతో వైకల్యంపై విజయం
  • అగర్‌బత్తీ తయారీ యూనిట్‌ ఏర్పాటు
  • ఆర్థికాభివృద్ధితో స్ఫూర్తిదాయకం 
  • స్వశక్తితో ‘అందె’ దివ్యాంగుల ఆదర్శం

మిరుదొడ్డి (జనవరి 3) :  మండలంలోని అందె గ్రామానికి చెందిన పది మంది దివ్యాంగులు ఒక సంఘంగా ఏర్పడి.. శ్రీరేణుక మాత పేరు పెట్టుకున్నారు. అమ్మవారి దీవెనలతో ఆత్మ విశ్వాసం కోల్పోకుండా దివ్యాంగులు మేము కూడా సమాజంలో ఒకరుగా నిలువాలనే తపనతో స్వశక్తితో ముం దుకు వెళ్తూ.. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

శ్రీరేణుకా మాత అగర్‌ బత్తీల యూనిట్‌ ఏర్పాటు

దివ్యాంగుల పట్టుదలకు ముగ్దులైన గ్రామంలోని ప్రజాప్రతినిధులు,  మహిళలు, ప్రముఖులు కలిసి  స్త్రీశక్తి మహిళా భవనంలో దివ్యాంగులకు ఒక షెటర్‌ను అద్దెకు ఇచ్చారు. ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని.. ఏలాంటి రుసుము తీసుకోకుండా ఇచ్చారు. గ్రామస్తుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ద్వారా ఇస్తున్న రూ.30 వేలు అప్పుగా తీసుకున్నారు.  దీంతో దివ్యాంగులు శ్రీరేణుక మాత అగర్‌బత్తీల తయారు కేంద్రాన్ని 2018లో ప్రారంభించారు. వీరి పట్టుదలను చూసి అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రూ.10 వేలు చెల్లించి అగర్‌బత్తీలను కొనుగోలు చేసి, వారికి ధైర్యాన్ని నూరిపోశారు. 

అగర్‌ బత్తీల తయారీ

మహిళా భవనంలో అగర్‌ బత్తీల కేంద్రం స్థాపించి,  ప్రతి రోజు 5 మంది దివ్యాంగులు పని చేస్తారు. నిత్యం  600 లేదా 700 వరకు అగర్‌ బత్తీలను తయారు చేప్తారు. అగర్‌బత్తీల తయారీలో వాడే ముడి సరుకును హైదరాబాద్‌ నుంచి సేకరిస్తున్నారు. మొదటగా బొగ్గు పొడిని నీళ్ల లో కలిపి జిగురు వచ్చే వరకు కలుపుతారు. మెత్తటి జిగు రు పదార్థాన్ని బల్లపై ముద్దగా పెట్టుకొని గుండ్రటి పుల్లలకు రాస్తారు. జిగట అంటుకోకుండా చెక్క పొట్టును చేతులకు రాసుకుంటారు. జిగటను అద్దించిన పుల్లలను ఎండలో ఆరబెడుతారు. అగర్‌ బత్తీలను కాల్చి నప్పుడు  సుంగంధ పరిమాళలు వెద జల్ల్లడానికి రసాయనాలు వాడుతారు. ఒక టబ్బులో ఒక కిలో సెంటును పోసి ఎండిన అగర్‌బత్తీలను (జిగట పెట్టిన పుల్లలు) అందులో ముంచు తారు. ఇలా అనేక శ్రమకు ఓర్చి ది వ్యాంగులు అగర్‌ బత్తీలను తయారు చేసి, దుకాణాల్లో విక్రయిస్తారు. 

ప్రతి నెలలో సుమారు 20 వేల అగర్‌ బత్తీలను తయారు చేస్తారు. అగర్‌ బత్తీలను ఒక్కో ప్యాకెట్‌లో 10 చొప్పున ప్యాక్‌ చేస్తారు. 10 అగర్‌ బత్తీలు తయారు చేయడానికి రూ.7 ఖర్చు పెడితే రూ.3 లాభంపై శ్రీ రేణుక మాత అగర్‌ బత్తి ప్యాకెట్‌ను రూ.10 చొప్పున అందె, సిద్దిపేటతోపాటు ఇతర గ్రామాల్లో విక్రయిస్తారు.

అగర్‌ బత్తీల మీద వచ్చే డబ్బులతో తీసుకున్న రుణా న్ని బ్యాంకులో ప్రతినెలా రూ.1800 చెల్లిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ 5 మంది సభ్యులు ప్రతి నెల వచ్చిన లాభాలను సమానంగా పంచుకుంటారు. పట్టుదల ఉంటే అన్నీ సాధ్యమేనని అందె గ్రామానికి చెందిన దివ్యాంగులు నిరూపిస్తున్నారు. 

చేయూత ఇస్తే మరింత ముందుకు.. 

పుట్టుకతో పోలియో బారినపడి కాళ్లు నడువ రాకున్నా  ముడు చక్రాల సైకిల్‌పై వెళ్తూ చిన్న పనులు, ఆగర్‌ బత్తీల ను తయారు చేస్తున్నారు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న దివ్యాంగులను దాతలు చేయూత అందించి ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పటికీ..

కొందరు పని చేయడమే కష్టంగా భావిస్తారు. సక లాంగులతో పోల్చితే దివ్యాంగులకు ప్రతిక్షణం నరకమే. కాళ్లు, చేతులు సక్రమంగా లేక ఇతరులపై ఆధారపడుతూ వారి తో చీదరింపులు.. ఈసడింపులకు దివ్యాంగులు గురవుతున్నా రు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ సమాజంలో మేము కూడా పని చేయగలమని.. స్వశక్తితో ఎదుగుతూ నాలుగు రాళ్లను సంపాదిస్తున్న అందె గ్రామ దివ్యాంగులపై ప్రత్యేక కథనం...

చేతనైన కాడికి పని చేస్తున్నాం..

రాష్ట్ర ప్రభుత్వం అంద జేస్తున్న రూ.3,016 పింఛన్‌కు తోడుగా మాకు చేతనై నంత వరకు అగర్‌బత్తీలను తయారు చేస్తూ రూ. 1500 వరకు సంపాదిస్తున్నాము. మా గ్రామస్తులు సహకారం తో పని చేస్తూ డబ్బులు సం పాదిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాం. మేము తయారు చేసే అగర్‌ బత్తీలను కొనుగోలు చేసి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాము.

- ఎండీ సాజిత్‌ పాషా, దివ్యాంగుడు, అందె గ్రామం 

VIDEOS

logo