సోమవారం 01 మార్చి 2021
Siddipet - Jan 04, 2021 , 00:13:55

అథ్లెటిక్స్‌ ఎంపికలు ప్రారంభం

అథ్లెటిక్స్‌ ఎంపికలు ప్రారంభం

సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 3 : సిద్దిపేట డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌ అండర్‌ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికల ఎంపికలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్‌ అధ్యక్షత వహించారు. సంఘ సేవకుడు నేతి కైలాసం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు సాధన చేసి ఉన్నత స్థానాలకు చేరేందుకు అసోసియేషన్‌ ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు క్రీడలను ప్రోత్సహిస్తూ వెన్నుదన్నుగా ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకటస్వామి, కోచ్‌ ప్రభాకర్‌, సత్యానందం, ప్రేమ్‌ రంగనాథ్‌, ఉప్పలయ్య, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

తాజావార్తలు


logo