ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 04, 2021 , 00:14:03

క్రీడల్లో గెలుపోటములు సహజం

క్రీడల్లో గెలుపోటములు సహజం

  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, ఎంజేబీ ట్రస్ట్‌ అధినేత మద్దుల నాగేశ్‌రెడ్డి 

మిరుదొడ్డి, జనవరి 3 : క్రీడల్లో గెలుపోటములు సహజమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, ఎంజేబీ ట్రస్ట్‌ అధినేత మద్దుల నాగేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మిరుదొడ్డి టౌన్‌లో మద్దుల జగన్మోహిన్‌ (ఎంజేబీ) ట్రస్ట్‌ సౌజన్యంతో మిరుదొడ్డి క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, మిరుదొడ్డి, దుబ్బాక ఎస్సైలు  శ్రీనివాస్‌, స్వామి, టీఆర్‌ఎస్‌ మండల సీనియర్‌ నాయకుడు సూకురి లింగంలతో కలిసి ప్రారంభించారు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌లో జిల్లావ్యాప్తంగా 48 టీంలు పాల్గొనగా, ఆరు టీంలు ఆడాయి. మిరుదొడ్డి పోలీస్‌, సిద్దిపేట ముర్షగడ్డ, వెంకట్రావ్‌పేట టీంలు గెలుపొందాయి. ఈ నెల 13వ తేదీ వరకు క్రీడలు కొనసాగనున్నాయి.  అనంతరం మద్దుల నాగేశ్‌రెడ్డి మాట్లాడుతూ మిరుదొడ్డిలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు గొల్ల విజయ్‌కుమార్‌, గంజి కొండల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గొట్టం బైరయ్య తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo