శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Jan 04, 2021 , 00:15:11

మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

చేర్యాల (జనవరి 3) : కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు మల్లన్నస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 25 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చినట్టు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ఒడిబియ్యం, కేశఖండన, గంగరేగుచెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకొని మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు అన్ని వసతులు కల్పించామని తెలిపారు. కార్యక్రమాలలో  ఏఈవో గంగా శ్రీనివాస్‌, పర్యవేక్షకులు నీల శేఖర్‌, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo