ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 04, 2021 , 00:15:09

వర్గల్‌ ఆలయాల్లో పూజలు

వర్గల్‌ ఆలయాల్లో పూజలు

వర్గల్‌ (జనవరి 3) : వర్గల్‌ విద్యాధరి, నాచగిరి లక్ష్మీనృసింహస్వామి దేవాలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. జంట నగరాలైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తోపాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సరస్వతీమాత, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాల్లో  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మొక్కుబడులు, ముడుపులు చెల్లించుకున్నారు. క్షేత్ర పరిసరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఆలయాల కార్యనిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

VIDEOS

logo