గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 02, 2021 , 00:10:54

పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌

హుస్నాబాద్‌లో  కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన

హుస్నాబాద్‌, జనవరి 1: హుస్నాబాద్‌ పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌ పట్టణంలోని రామవరం రోడ్డులో పట్టణ రెడ్డి సంఘం, మున్నూరుకాపు సంఘం కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 

  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలన్నింటికీ కమ్యూనిటీ భవనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కమ్యూనిటీ భవనాలు కేవలం సభలు, సమావేశాలకే కాకుండా విద్యార్థులు, యువత చదువుకునేందుకు వసతి కల్పించే విధంగా ఉండాలన్నారు. హుస్నాబాద్‌లో రెడ్డి, మున్నూరు కాపు భవనాలకు డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.23లక్షలు మంజూరయ్యాయని, ఈ భవనాల నిర్మాణ పనులు సత్వరంగా పూర్తి చేయాలన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో నిర్మించిన శౌచాలయాన్ని ప్రారంభించారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితవెంకట్‌, రైతు విమోచన కమిషన్‌ సభ్యుడు కవ్వ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, మార్కెట్‌ చైర్మన్‌ కాసర్ల అశోక్‌బాబు, సింగిల్‌విండో చైర్మన్లు తిరుపతిరెడ్డి, శివయ్య, వైస్‌చైర్‌పర్సన్‌ అయిలేని అనీతారెడ్డి, కాంగ్రెస్‌  నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, కౌన్సిలర్లు వాల సుప్రజ, బోజు రమాదేవి, గూల్ల రాజు, బొల్లి కల్పన, బొజ్జ హరీశ్‌, అయిలేని శంకర్‌రెడ్డి, ఎండీ అయూబ్‌, చిత్తారి పద్మ, స్వర్ణలత, నాయకులు ఎడబోయిన తిరుపతిరెడ్డి, ఆకుల వెంకట్‌, ఎండీ అన్వర్‌, చిట్టి గోపాల్‌రెడ్డి, బొద్దుల కనుకలక్ష్మి, తిరుమలరెడ్డి, మంజులరెడ్డి, వాల నవీన్‌, బొల్లి శ్రీనివాస్‌, రెడ్డి, మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు.


VIDEOS

logo