టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

గజ్వేల్ / గజ్వేల్ అర్బన్ (డిసెంబర్ 31) : తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పోరాట స్ఫూర్తి మరువలేదని, సీఎం కేసీఆర్ సంక్రాంతి లోపు ఉపాధ్యాయులకు శుభవార్త ప్రకటించనున్నారని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో పీఆర్టీయూ క్యాలెండర్‌ను మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు త్వరలో శుభవార్త వింటారని తెలిపారు. కరోనా విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాలను ఆటంకాలు లేకుండా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు త్వరలో వేతనాలు, పదోన్న తులను కల్పించడానికి కృషి చేస్తామన్నారు. సంక్రాంతి తర్వాత 10వ తరగతి విద్యార్థుల కోసం స్కూళ్లు తెరువాలని, గజ్వేల్‌లో పీఆర్టీయూ భవనాన్ని నిర్మించాలని టీచర్లు కోరారు. కార్యక్రమంలో ఎంఈవో సునీత, పీఆర్టీయూ నేతలు రామకృష్ణారెడ్డి, కరీమొద్దీన్, వేమారెడ్డి, పోచయ్యగౌడ్, అరుణకుమారి, అనురాధ, జానకిరాంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్, కనకరాములు, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్