సోమవారం 01 మార్చి 2021
Siddipet - Jan 01, 2021 , 02:01:15

యూజీడీ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

యూజీడీ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

గజ్వేల్‌ (డిసెంబర్‌31) : మున్సిపాలిటీలో భూగర్భ మురుగునీటి కాల్వల(యూజీడీ) నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ.. వేగంగా పూర్తి చేయాలని నిర్మా ణ సంస్థను గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి ఆదేశించారు. యూజీడీ పనుల్లో వేగం పెంచాలని, పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. గజ్వేల్‌లోని 9, 19 వార్డుల్లో ఆయన శుక్రవారం ఆకస్మికంగా పర్యటించి, పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పట్ణణం లో 96 కిలోమీటర్ల యూజీడీ పనులపై లక్ష్యం ఉందని.. ఇప్పటికే 42 కిలోమీటర్లు నిర్మించినట్లు తెలిపారు. పట్టణ నాలుగు వైపులా ఎస్‌టీపీ నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. యూజీడీ నిర్మాణాల్లో వాడుతున్న సిమెంట్‌ ఇటుకల నాణ్యతను పరిశీలించారు. కొన్ని వీధుల్లో పైపులైన్ల కోసం తీసిన గుం తలను పరైన ప్రమాణాలతో పూడ్చడం లేదన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెయిన్‌ పైపులైన్‌ కాల్వ పూడ్చివేత పనులను పరిశీలించారు. బుధవారం రాత్రి పీఆర్‌, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ, వ్యవసాయ శాఖ అధికారుల తో వేర్వేరుగా సమావేశమై అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ కృష్టారెడ్డి, యూజీడీ నిర్మాణ సంస్థ ప్రతినిధి అప్పల రాజు ఉన్నారు. 

VIDEOS

logo