శనివారం 06 మార్చి 2021
Siddipet - Jan 01, 2021 , 02:01:17

సేవలే గుర్తుంటాయి

సేవలే గుర్తుంటాయి

సిద్దిపేట కలెక్టరేట్‌ (డిసెంబర్‌ 31) :  నీటిపారుదల శాఖలో 33 ఏండ్లుగా విధులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ పొందిన బెజ్జంకి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వర్లును నీటి పారుదల శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యాలయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ నీటి పారుదల శాఖలో ఆయన అందించిన సేవలు గుర్తుంటాయన్నారు. కార్యనిర్వాహక ఇంజినీర్‌ నాగరాజు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు అందించిన సేవలు మరిచిపోలేనివన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ హరికిషన్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ శ్రీనివాస్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రాజేందర్‌, భీమ్‌, తిరుపతి, సుధాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo