మంగళవారం 09 మార్చి 2021
Siddipet - Dec 31, 2020 , 00:04:54

బాధితులకు అండగా ఉంటాం

బాధితులకు అండగా ఉంటాం

  • ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం

గజ్వేల్‌ అర్బన్‌ : వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుంటుకు నర్సింహులు కుటుంబానికి అండగా ఉంటామని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం మృతుడి భార్య పద్మకు రూ.7లక్షల నష్టపరిహారం చెక్కును  అందజేశారు. గజ్వేల్‌ మున్సిపల్‌లోని 19వ వార్డులో ఉన్న గుంటుకు నర్సింహులు ప్రమాదవశాత్తు వారం రోజుల క్రితం రోడ్డుపై టిప్పర్‌ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి.. సదరు టిప్పర్‌ యాజమాన్య సంస్థతో మాట్లాడి రూ.7 లక్షల పరిహారం ఇప్పించారు. మృతుడు నర్సింహులు టీఆర్‌ఎస్‌ కార్యకర్త అని, అతడికి పార్టీ సభ్యత్వం ఉందని తెలిపారు. పార్టీ ప్రమాద బీమాలో రూ.2లక్షలు కూడా అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట నాయకులు గుంటుకు రాజు, మల్లేశం, తోట శ్రీనివాస్‌ స్వామి ఉన్నారు. 

ఉపాధ్యాయుడి కుటుంబానికి అధ్యాపకుల భరోసా 

సిద్దిపేట రూరల్‌ : వృత్తినే దైవంగా నమ్ముకుని సేవలందించిన సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కనకరాజు (33) ఈ నెల 15న అనారోగ్యంతో మృతి చెం దాడు. అతడి మృతితో చలించిన మెదక్‌ జిల్లా ఉపాధ్యాయులు... తమవంతుగా విరాళాలు సేకరించారు. ఈ మేరకు మృతు డి కుటుంబానికి రూ.2,20,000 నగదును మెదక్‌ డీఈవో రమేశ్‌కుమార్‌, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి సమక్షంలో అందజేశారు. మృతుడు కనకరాజు 2012 డీఎస్సీలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఎంపికై మెదక్‌ జిల్లా నాగసాన్‌పల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు. కార్యక్రమంలో పీఆర్టీయూ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఎంఈవోలు నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్టీ యూ నేతలు శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, రవి, మల్లారెడ్డి, వెంకట్రామ్‌రెడ్డి, సతీశ్‌రావు, సంతోష్‌, అమీరుద్దీన్‌, పుల్లూరు సర్పంచ్‌ నరేశ్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ సీహెచ్‌ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. 

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత...

జగదేవ్‌పూర్‌ : మండలంలోని పలుగుగడ్డ గ్రామానికి చెందిన ఆరుముళ్ల బుచ్చాలు అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ రాజేశ్వరి, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్పంచ్‌ రూ.2 వేలు, టీఆర్‌ఎస్‌ నాయకులు రూ.5 వేలు అందజేశారు.  

టీఆర్‌ఎస్‌ నాయకుడికి పరామర్శ 

కోహెడ : మండలంలోని పరివేద టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు ఇడబోయిన రామచంద్రం తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ మేరకు రామచంద్రం కుటుంబీకులను మాజీ ఎంపీపీ, ఇండస్ట్రీయల్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు తిప్పారపు శ్రీకాంత్‌ పరామర్శించారు. ఆయన వెంట కూరెళ్ల ఎంపీటీసీ జాగిరి కుమారస్వామి, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు జాగిరి యాదగిరి ఉన్నారు. 

చేనేత కుటుంబానికి చేయూత

దుబ్బాక టౌన్‌ : లచ్చపేటలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చేనేత కార్మికుడు వంగరి కిషన్‌ను వీవర్స్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం రామకృష్ణప్రభు పరామర్శించి, 25 కిలోల బియ్యాన్ని అందజేశారు.    ఆయన వెంట  బాలకృష్ణ, గణేశ్‌, నగేశ్‌, మహేశ్‌ ఉన్నారు. 

VIDEOS

logo