మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Dec 31, 2020 , 00:04:43

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి
  • చేర్యాల మున్సిపల్‌లో పనులు ప్రారంభం

చేర్యాల : ప్రభుత్వం చేర్యాల మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి అన్నారు. మున్సిపల్‌లోని 4వ వార్డులో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.4.11 లక్షలు, 11వ వార్డులో రూ.2.57 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం వైస్‌చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ స్వరూపారాణి మాట్లాడుతూ.. చేర్యాల మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి  నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మున్సి పల్‌లోని వార్డులను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు నిధులు మం జూరు చేస్తామన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఇప్పటికే గుర్తించామని, ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు  తారాయాదగిరి, సతీశ్‌గౌడ్‌, నరేందర్‌, లింగం, జుబేదా ఎక్బాల్‌, మం గోలు చంటి, కోఆప్షన్‌ సభ్యుడు నాగేశ్వర్‌రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత ముస్త్యాల బాల్‌నర్సయ్య, యూత్‌ నాయకుడు రావుల ఉమేశ్‌గౌడ్‌ ఉన్నారు. 

VIDEOS

logo