ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు

- ఉద్యోగ విరమణ సభలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి
సిద్దిపేట అర్బన్ : ఉద్యోగకాలంలో చేసిన మంచి పనులే చిరస్థాయి గా నిలిచిపోతాయని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్ ఉద్యోగ విరమణ సభ బుధవారం జరిగింది. కార్యక్రమంలో పీఆర్టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ, జీహెచ్ఎం రామస్వామి, పీఆర్టీయూ బాధ్యులు సత్యనారాయణరెడ్డి, ఆస లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి..
నారాయణరావుపేట : సమాజంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్ట లేనివని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. జక్కాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు కాచం శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్ర మాన్ని పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మ, మండల అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు మల్లారెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలపై హార్షాతీరేకాలు
మర్కూక్ : రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణాయాలపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు హార్షం వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మర్కూక్ జడ్పీ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బి.పరమేశ్వర్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఉద్యోగుల వేతనాల పెంపుపై తీసుకున్న చర్యలపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంఈవో వెంకటేశ్వర్‌గౌడ్ మా ట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో ఉద్యోగ విరమణ తప్పదని, ఉద్యోగిగా తనవంతు విద్యుక్తధర్మాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినప్పుడే జన్మధన్యమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రావు, కుమార్, విద్యానగర్నరెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగులు సమాజసేవకు పాటుపడాలి..
హుస్నాబాద్ టౌన్ : ఉద్యోగ విరమణ అనంతరం సమాజసేవకు కృషిచేయాలని మున్సిపల్ చైర్పర్సన్ రజిత అన్నారు. స్థానిక జడ్పీ ఉ న్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్యావళి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బండారి మనీల, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటనర్సయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం