గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 30, 2020 , 00:27:56

‘నేర’ చరిత్ర 2020/ రౌండప్‌

‘నేర’ చరిత్ర 2020/ రౌండప్‌

 • సిద్దిపేట జిల్లాలో 6,034 కేసులు నమోదు
 • సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలో పెరిగిన కేసులు
 • 700 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదు 
 • రోడ్డు ప్రమాదాల్లో 267 మంది మృత్యువాత 
 • ముగ్గురు నేరస్తులపై పీడీ యాక్టు

ఈ ఏడాది సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 6,034 కేసులు నమోదయ్యాయి. గతేడాది 5,178 కేసులు నమోదయ్యాయి. గతం కంటే ఈసారి కేసుల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాద కేసులు 700 నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో 267 మంది చనిపోగా, 717 గాయపడ్డారు. సిద్దిపేట శివారు రాజీవ్హ్రదారిపై ఈ నెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆరోగ్యం బాగాలేదని తల్లిదండ్రులను కుమారుడు కారులో దవాఖానకు తీసుకెళ్తుండగా, ప్రమాదవశాత్తు కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, కారులో ఇరుక్కున్న వారి మృతదేహాలను తీసేందుకు వెళ్లగా డీసీఎం వేగంగా ఢీకొనడంతో మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా ఐదుగురు అక్కడికక్కడనే మృతిచెందారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన సీఐ, నలుగురు పోలీసులతో పాటు 12మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది జిల్లాలో అతి పెద్ద ప్రమాదంగా చెప్పవచ్చు.

- సిద్దిపేట, నమస్తే తెలంగాణ

2020లో సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనమోదైన కేసుల వివరాలు... 

 • సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 6,034 కేసులు నమోదయ్యాయి. 
 • దొంగతనం కేసులు 537 నమోదయ్యాయి. దొంగిలించబడిన సొత్తు 2,48,78,661.వివిధ కేసుల్లో నేరస్తులను అరెస్టు చేసి 1,00,84,692 రికవరీ చేశారు. 41 శాతం రికవరీ చేశారు.
 • 17 మర్డర్‌ కేసులు నమోదయ్యాయి. నేరస్తులను అరెస్టు చేసి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.
 • గొడవల కేసులు 746 నమోదయ్యాయి. నిందితులను అరెస్టు చేసి విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.
 • రోడ్డు యాక్సిడెంట్‌ కేసులు 700 నమోదయ్యాయి. 267 మంచి చనిపోయారు. 717 గాయపడ్డారు. 
 • మహిళలకు సంబంధించిన వివిధ రకాలైన కేసులు 599 నమోదయ్యాయి. అన్ని కేసుల్లో నేరస్తులను అరెస్టు చేసి విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. 
 • ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,72,045 కేసులు నమోదు చేసి రూ.5,50,72,510 జరిమానా విధించారు. 
 • స్పీడ్‌ లేజర్‌ గన్‌ ద్వారా వేగ నియంత్రణ 74,500 కేసులు నమోదు చేసి రూ. 7,69,50,595 జరిమానా విధించారు. 
 • ఇసుక అక్రమ, మద్యం, దుకాణాలు, గుట్కా, బొగ్గు తదితర వాటిపై రైడ్‌ చేసి 355 కేసులు నమోదు చేశారు. 
 • మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులపై డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు 1499 నమోదు చేసి 155 మంది వ్యక్తులను జైలుకు పంపించారు. రూ.21,65,600 జరిమానా విధించారు. 
 • గేమింగ్‌ యాక్టు (జూదం) ఆడిన వారిపై 72 కేసులు నమోదు చేసి 487 మందిని అరెస్టు చేసి రూ.7,76,433 స్వాధీనం చేసుకొని కోర్టులో డిపాజిట్‌ చేశారు.
 • షీ టీమ్స్‌ ద్వారా 13 మంది ఆకతాయిలను పట్టుకొని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు. 
 • ‘డయల్‌ యువర్‌ 100’ కాల్స్‌ 27,249 రిసీవ్‌ చేసుకొని 1502 కేసులు నమోదు చేశారు. 
 • సిద్దిపేట జిల్లాలో ఉన్న 499 గ్రామ పంచాయతీలకు గాను కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ మహిళా సంఘాల సహకారంతో 476 గ్రామాల్లో 4,806 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 
 • పోలీసు కళాబృందం కనువిప్పు కార్యక్రమం 97 గ్రామాల్లో నిర్వహించి మూఢనమ్మకాలు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, తదితర అంశాల గురించి ప్రజలను చైతన్యపర్చారు.
 • సిబ్బందికి, అధికారులకు వర్టికల్‌ వారీగా శిక్షణ ఇచ్చారు. 
 • హాక్‌ ఐ యాప్‌ ద్వారా వచ్చిన 152 ఫిర్యాదులను పరిష్కరించారు. 
 • స్టూడెంట్‌ పోలీసు క్యాడెట్‌ గురించి 16 స్కూళ్లలో 704 ఎంపిక చేసి పోలీసుల విధులు, క్రమశిక్షణ, వివిధ రకాల అంశాల గురించి ప్రభుత్వ టీచర్లు, పోలీసులు కలిసి శిక్షణ ఇచ్చారు. 
 • పోలీసు సిబ్బంది, అధికారుల సంక్షేమం గురించి సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పోలీసు సబ్సిడరీ వెల్ఫేర్‌ స్టోర్‌ నిరంతరాయంగా కొనసాగుతున్నది. 
 • తరచుగా నేరాలకు పాల్పడే నేరస్తులపై, హత్య కేసు నేరస్తులపై, నేరాల ముగ్గురు  నేరస్తులపై పీడీ యాక్టు కింద జైలుకు పంపించారు.
 • జైలు శిక్ష పడిన 647 కేసులు, 50 శాతం లోక్‌అదాలత్‌లో కాంప్రమైజ్‌ అయిన కేసులు 962. 
 • 3,005 పాస్‌పోర్ట్‌ ఎంక్వైరీ చేసి అందజేశారు. 
 • 42 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా సమయంలో ప్లాస్మా దానం చేశారు.68 మంది పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు
 • సైబర్‌ నేరాలు 16 కేసులు నమోదు చేశారు. కేసులన్నీ పరిశోధనలో ఉన్నాయి.

అనారోగ్యంతో సోలిపేట రామలింగారెడ్డి మృతి 

అనారోగ్యంతో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడి ఆగస్టు 6న చికిత్స పొందుతూ మృతి చెందారు. రామలింగారెడ్డి మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి, దుబ్బాక ప్రజలకు తీరని లోటు అని చెప్పాలి. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో నిర్వహించిన సోలిపేట అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, తదితర మంత్రులతో పాటు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు తమతో కలిసి నడిచిన లింగన్నకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దుబ్బాక ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు.

కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, సిద్దిపేట మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పది రోజుల పాటు దవాఖానలోనే చికిత్స పొందారు. ఈయన ఆరు సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ప్రాతినిధ్యం వహించారు. నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నాయకుడు. అందిరతో కలుపుగోలుగా ఉండి కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవులను నిర్వహించారు. సిద్దిపేట లోకసభ నియోజకవర్గ ప్రజలు నంది ఎల్లయ్యను ఐదుసార్లు లోక్‌సభకు పంపారు. అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే , ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాలుపంచుకున్నారు. 

VIDEOS

logo