Siddipet
- Dec 30, 2020 , 00:29:38
VIDEOS
మల్లన్న కల్యాణానికి ఆహ్వానం..

- ప్రజాప్రతినిధులకు శుభలేఖలు అందజేసిన ఆలయ ఈవో
చేర్యాల: జనవరి 10వ తేదీన నిర్వహించే కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికలను ఆలయ ఈవో ఏ.బాలాజీ అందజేశారు. మంగళవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ చీఫ్‌విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌కు వారి హైదరాబాద్‌లోని నివాసాల్లో కలిసి శుభలేఖలు అందజేసి ఆహ్వానించారు. ఆయన వెంట ఏఈవో గంగా శ్రీనివాస్, ఆలయ స్థానాచారీ పడిగన్నగారి మల్లేశం, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఉపప్రధానార్చకుడు ఆకుల విజయ్‌కుమార్, పీఆర్వో కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING