కొత్తూరు రూరల్, జూన్ 6: కరోనా విపత్కర పరిస్థి తుల్లో ప్రజలకు ఆశవర్కర్లు అందిస్తున్న సేవలు మరువ లేనివని, వారి సేవలకు వెలకట్టలేమని లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ హీరో శ్రీతేజ్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా రీజినల్ చైర్మన్ మామిడి భీంరెడ్డి అన్నారు. కొత్తూరు మం డలం లోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న ఆశవర్కర్లకు, కొత్తూరు మున్సిపాలిటిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆది వా రం రెడ్‌క్రాస్‌సొసైటీ ఆధ్వర్యంలో మెడి కల్, ఎనర్జీ కిట్స్‌ను, మాస్క్‌లు, శానిటైజర్లు, పల్స్ మీ టర్స్ను, ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్, వాపోరైజర్స్ ను ఉచితంగా పంపిణీచేశారు.ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతి థిగా సినినటుడు శ్రీతేజ్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా రీజినల్ చైర్మన్ మామిడి భీంరెడ్డి, కొత్తూరు మాజీ ఎంపీటీసీ బాతుక దేవేందర్‌యాదవ్ హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటు వంటి సమయంలో వైద్యసేవలు కావాలన్నా రెడ్‌క్రాస్ సొసైటీ టోల్‌ఫ్రీ నెంబర్కుగాని, వాట్సాప్ నెంబర్‌కు కాని ఫోన్‌చేసి వైద్యసేవలను ప్రజలు ఉపయోగిం చుకో వాలన్నారు. వీడియోకాల్ ద్వారా ఎంతో సీనియర్ డా క్టర్లతో ఫ్రీ కన్సల్టేషన్ ఉంద న్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మంజులత, టీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ రాఘవేందర్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.