పని చేసే నాయకులకే గుర్తింపు

- ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
- గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు సన్మానం
జగదేవ్‌పూర్ : ప్రజల కోసం పని చేసే నాయకులకు ప్రజల్లో ఎప్పుడు గుర్తింపు, ఆదరణ ఉంటుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గం 112 వ వార్డు నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్ పుష్పానగేశ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి, కార్యకర్తలతో కలిసి కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తన గెలుపుకోసం పని చేసిన కార్యకర్తలు నాయకులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ పుష్పానగేశ్ మాట్లాడుతూ తన గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు ఎంతో శ్రమించారన్నారు. కార్యకర్తలను ఆత్మీయంగా సన్మానించడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మా దాసు అన్నపూర్ణశ్రీనివాస్, స్థానిక సర్పంచ్ రజితరమేశ్, ఎంపీటీసీ కావ్యదర్గయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి,దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి,పలువురు రాష్ట్ర జిల్లా కురుమసంఘం నాయకులు, సర్పంచులు యాదవరెడ్డి, నరేశ్, మం డల కో-ఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, ఎంపీటీసీ కవితాశ్రీనివాస్‌రెడ్డి మండల నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అంబారీపేటలో పౌరహక్కుల దినోత్సవం
- వేలం విధానంలో క్రికెట్ టోర్నమెంట్లు వద్దు..!
- ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు: టీటీడీ
- కాంగ్రెస్ బలహీనపడిందన్నది వాస్తవం: కపిల్ సిబల్
- సురభి వాణీ దేవిని గెలిపించుకోవాలి : మంత్రి హరీశ్
- బెంగాల్ పోల్ షెడ్యూల్ : ఈసీ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం
- రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో స్టార్ క్రికెటర్లు
- లొల్లి పెట్టొద్దన్నందుకు తల్లీకొడుకుకు కత్తిపోట్లు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!