సమన్వయంతో పనిచేయాలి

- వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి
సిద్దిపేట టౌన్ : అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి యూఐ కేసులను తగ్గించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పెండింగ్ కేసులపై డీజీపీ ఆయన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణకు, సేఫ్ అండ్ సెక్యూరిటీకి త్వరితగతిన కేసులను చేధించాలన్నారు. సైబర్ నేరాలపై పరిశోధన లోతుగా జరిపి నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. లాంగ్ పెండింగ్ యూఐ కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలని పేర్కొన్నారు. పెండింగ్ నాన్‌బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి జిల్లాల వారీగా ప్రశంసా పత్రాలను ఇస్తున్నామన్నారు.
పోలీసులను అభినందించిన డీజీపీ
కరోనా సమయంలో పోలీసుల స్ఫూర్తిదాయక సేవలను డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విధులు నిర్వర్తిస్తూ, ప్లాస్మా దానం చేసిన పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఈ ఏడాది పోలీసుల పనితీరు బాగుందని కొనియాడారు. డయల్ యువర్ 100 సేవలు బాగున్నాయని, పోలీసులు ప్రజలకు దగ్గరై సేవలందించడం అభినందనీయమన్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు నంబర్ -1గా నాలుగు సంవత్సరాలుగా నిలుస్తున్నారని పోలీసు శాఖకే గర్వకారణమని తెలిపారు. పెండింగ్ కేసులను చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు సిద్దిపేట అడిషనల్ ఏసీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులపై ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీలు రామేశ్వర్, మహేందర్, నారాయణ, ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీఐలు ప్రసాద్, నర్సింహారావు, శ్రీనివాస్, ఎస్సై ముఖేద్పాషా తదితరులు పాల్గొన్నారు.