వరి వెద సాగుపద్ధతి పరిశీలన

సిద్దిపేట అర్బన్ : మంత్రి హరీశ్‌రావు దేశాల మేరకు కరీనంగర్ జిల్లా కొండపలకల గ్రామంలో లక్ష్మిరెడ్డి రైతు క్షేత్రాన్ని సోమవారం సిద్దిపేట అర్బన్ మండలంలోతో పాటు పలువురు రైతులు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగనాగిరెడ్డి నేతృత్వంలో సందర్శించారు. అక్కడ రైతు చేస్తున్న వరి వెద సాగు పద్ధతిపై పూర్తిగా తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారి బి.పరుశరాంరెడ్డి సిద్దిపేట రైతులకు అక్కడి సాగువివరాలను వివరించారు. సిద్దిపేట ప్రాంతంలో కూడా వరివెద సాగు చేపట్టే దిశగా కృషి చేస్తామని వ్యవసాయ అధికారి తెలి పారు.
చిన్నకోడూరులో..
చిన్నకోడూరు : చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వరివెద సాగు విధానాన్ని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి సందర్శనకు గానూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల గ్రామానికి సోమవారం తరలివెళ్లారు. మంత్రి తన్నీ రు హరీశ్‌రావు సూచనల మేరకు పలు గ్రామాల సర్పంచులు, రైతుబంధు సభ్యులు, ఏఈవోల సమక్షంలో రైతులు సందర్శనకు వెళ్లారు. కొండపలకల గ్రామంలో రైతు లక్ష్మీతిరుపతిరెడ్డి వరివెద పద్ధతిలో సాగు చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. వరివెద సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, కూలీ ల సమస్యను తక్కువ సమయంలో పంట కోతకు వస్తుందన్నారు. ఈ సందర్భంగా వరివెద సాగు విధానం చేపట్టి దిగుబడులు సాధిస్తామన్నారు.
తాజావార్తలు
- నవీన్, ప్రియదర్శిని ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- దిగొస్తున్న బంగారం.. మున్ముందు కింది చూపులేనా?!
- కనిపించినవాళ్లను కాల్చేస్తా.. టిక్‌టాక్‌లో సైనికుల బెదిరింపు
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు
- గోల్కొండ కోటకు కొత్త సోయగం.. సౌండ్ అండ్ లైట్ షో
- రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్
- ఎడ్లబండ్లపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు..
- బెంగాల్ పోరు : నందిగ్రాం బరిలో దీదీపై సువేందు అధికారి పోటీ!
- వాణీదేవి గెలుపే లక్ష్యంగా డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం