సోమవారం 01 మార్చి 2021
Siddipet - Dec 28, 2020 , 00:15:41

పట్టణాభివృద్ధే ధ్యేయం

పట్టణాభివృద్ధే ధ్యేయం

  • ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌

 హుస్నాబాద్‌ టౌన్‌ : పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని 10వ వార్డులో టీయూఎఫ్‌డీసీ కోటాలో రూ.28 లక్షలతో చేపట్టిన మురుగునీటి కాల్వల నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్ట ణ ఆధునీకరణకు సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలి పారు. ఇప్పటికే పలు వార్డుల్లో సీసీరోడ్లను నిర్మించామని, ము రుగునీటి కాల్వలను సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, వైస్‌చైర్‌పర్సన్‌ అనిత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అశోక్‌బాబు, మాజీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మధుకర్‌, కౌన్సిలర్లు రవి, హరీశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు వెంకట్రామ్‌రెడ్డి,  పట్టణాధ్యక్షుడు అన్వర్‌, నేతలు గోపాల్‌రెడ్డి, రమేశ్‌నాయక్‌, నవీన్‌, సతీశ్‌, శ్రీనివాస్‌ ఉన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo